![]() |
![]() |

కేవలం మూడు సినిమాలతోనే పాన్ ఇండియా వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. 'అర్జున్ రెడ్డి'తో దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయమై మొదటి సినిమాతోనే సంచలనం సృష్టించాడు. అదే సినిమాకి రీమేక్ గా రూపొందిన 'కబీర్ సింగ్'తో బాలీవుడ్ లోకి అడుగుపెట్టి అక్కడా సంచలనం సృష్టించాడు. ఇక ఆయన డైరెక్షన్ లో వచ్చిన రీసెంట్ మూవీ 'యానిమల్' రూ.800 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. దీంతో ఆయన తదుపరి సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
సందీప్ రెడ్డి ప్రస్తుతం మూడు సినిమాలు కమిటై ఉన్నాడు. ప్రభాస్ తో 'స్పిరిట్', రణబీర్ కపూర్ తో 'యానిమల్ పార్క్', అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. అయితే ఈ మూడు సినిమాల్లో ఏది ముందు, ఏది వెనుక అనే సస్పెన్స్ కొనసాగుతుంది. తాజాగా ఈ సస్పెన్స్ కి తెరదించాడు సందీప్. ఆయన చేయబోయే నెక్స్ట్ మూవీ స్పిరిట్. దీని తర్వాత 'యానిమల్'కి సీక్వెల్ గా 'యానిమల్ పార్క్' చేయనున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక చివరగా అల్లు అర్జున్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.
![]() |
![]() |