![]() |
![]() |
ప్రముఖ సీనియర్ నటి హేమాచౌదరి ఆరోగ్యం ఆందోళనకరంగా మారింది. 68 సంవత్సరాల హేమాచౌదరి గత కొంతకాలంగా మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవల ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జాయిన్ చేశారు. ప్రస్తుతం ఆమెకు ఐసియులో చికిత్స అందిస్తున్నారు. తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో హీరోయిన్‌గా, సహాయనటిగా 180కి పైగా సినిమాల్లో నటించిన హేమాచౌదరి.. ఎన్‌టిఆర్, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, కమల్‌హాసన్, రాజకుమార్, విష్ణువర్థన్, మోహన్‌బాబు వంటి హేమాహేమీలతో కలిసి నటించారు. అలాగే దక్షిణాదిలోని టాప్ డైరెక్టర్స్ అందరి సినిమాల్లో ఆమె మంచి పాత్రలు పోషించింది.
1975లో ఈకాలం దంపతులు అనే తెలుగు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి సౌత్‌లోని అన్ని భాషల్లో మంచి నటిగా పేరు తెచ్చుకుంది. తెలుగులో ఆమెకు మంచి పేరు తెచ్చిన సినిమాలు సుందరకాండ, ప్రేమవిజేత, పుట్టింటికి రా చెల్లి, గోరింటాకు. హైదరాబాద్‌లో జన్మించిన హేమా చౌదరి అసలు పేరు దుర్గాప్రభ. ఆమె ఆరోగ్యంపట్ల పలువురు సినీ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. త్వరగా హేమ కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
![]() |
![]() |