![]() |
![]() |

ప్రభాస్ ఫాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సలార్ మూవీ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లోకి అడుగుపెట్టింది. అడుగుపెట్టడమే కాదు ఇప్పటివరకు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఉన్న రికార్డులన్నింటినీ ఒక మూలన కూర్చోబెట్టింది. పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్న సలార్ ఖాతాలో ఒక అదిరిపోయే రికార్డు వచ్చి చేరింది.
నైజం ఏరియాలో సలార్ తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ కి సంబంధించి 12 .2 కోట్ల గ్రాస్ ని రాబట్టి చరిత్ర సృష్టించింది. అంతకు ముందు ఆర్ఆర్ఆర్ సినిమా 10 .5 కోట్లు రాబట్టి హయ్యెస్ట్ గా నిలిచింది. ఇప్పుడు ఆ రికార్డుని ప్రభాస్ బద్దలు కొట్టడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. అలాగే తనని నైజాం కింగ్ అని ఎందుకు అంటారో మరోసారి ప్రభాస్ అందరికి తెలియచేసాడు.
విడుదలైన అన్ని చోట్ల మంచి టాక్ ని సొంతం చేసుకుంటు ముందుకు దూసుకుపోతున్న సలార్ రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులని సృష్టించడం ఖాయమని ప్రభాస్ ఫ్యాన్స్ అంటున్నారు. ప్రస్తుతానికి అయితే చాలా రోజుల తర్వాత థియేటర్స్ దగ్గర పండగ వాతావరణం నెలకొని ఉంది. అలాగే ఆల్ సెంటర్స్ లో సండే దాకా టికెట్స్ బుక్ అయిపోయాయి. రాబోయే రోజుల్లో సలార్ ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
![]() |
![]() |