Home

»

Latest News

300 మంది తో నాగార్జున.. కాలర్ ఎగరేస్తున్న అభిమానులు

Dec 22, 2023 10:58AM

అక్కినేని నాగార్జునకి ఉన్న ఫ్యాన్  ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. తెలుగు కళామతల్లి ఒడిలో ఎన్ని పాత్రలైతే ఉంటాయో అన్ని పాత్రల్లోను నటించి తనకి పోటీ లేదని నాగ్ నిరూపించాడు. బహుశా ఇండియన్ సినిమా పుట్టిన దగ్గరనుంచి సిల్వర్ స్క్రీన్ మీద  నాగార్జున పోషించిన పాత్రలని ఇంకే నటుడు పోషించలేదని కూడా  చెప్పాలి.  తాజాగా ఆయన  హీరోగా నటిస్తున్న చిత్రం నా సామి రంగ.  శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించిన తాజా న్యూస్ ఒకటి నాగ్ అభిమానులని ఆనందంలో ముంచెత్తుతుంది.

అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన ఒక  భారీ సెట్‌లో నా సామిరంగ టైటిల్ సాంగ్‌ని చిత్రీకరిస్తున్నారు. ప్యూర్ మాస్ సాంగ్ గా తెరకెక్కుతున్న ఈ పాటలో నాగార్జునతో పాటు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా కలిసి చిందులు వేస్తున్నారు. మూవీ మొత్తానికే  హైలెట్ గా నిలవనున్న ఈ సాంగ్ చిత్రీకరణలో సుమారు  300 మంది డ్యాన్సర్లు దాకా పాల్గొన్నారు. దినేష్ కొరియోగ్రఫీ లో ఈ సాంగ్ తెరకెక్కుతుంది. కీరవాణి సంగీత సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ పాటకి చంద్రబోస్ సాహిత్యాన్ని అందచేశారు.

నాగార్జున సరసన ఆషికా రంగనాథ్ కథానాయికగా నటిస్తున్న సామి రంగ మూవీని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. దాశరథి  శివేంద్ర  సినిమాటోగ్రఫీ అందిస్తుండగా ప్రముఖ రచయిత  ప్రసన్న కుమార్ బెజవాడ కథ, సంభాషణలని అందించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్  విజయ్ బిన్ని స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో  సంక్రాంతి కానుకగా నా  సామి రంగ  ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్రెడీ విడుదలైన టీజర్ తో ఈ మూవీ మీద నాగ్ అభిమానుల్లోను అండ్ సినీ ప్రేక్షకుల్లోను అంచనాలు పీక్ లో ఉన్నాయి. 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com