![]() |
![]() |
ఈ ఏడాది క్రిస్మస్ సినిమాల సందడి మొదలైంది. మొదటి సినిమాగా ‘డంకీ’ వచ్చేసింది. ఇక మిగిలింది ‘సలార్’. మొదటి నుంచీ ఈ రెండు సినిమాల మధ్య భారీ పోటీ ఉంటుందని, ఎవరు విన్ అవుతారు, ఎవరు లాస్ అవుతారు అనే చర్చ సోషల్ మీడియాలో విపరీతంగా జరిగింది. ఈ ఏడాది రెండు బ్లాక్‌బస్టర్స్‌తో మంచి ఊపు మీద ఉన్న షారూక్, కేవలం బాహుబలి క్రేజ్‌తోనే రంగంలోకి దిగిన ప్రభాస్.. వీరిద్దరి మధ్య పోటీ భారీగానే ఉంది. అయితే కెజిఎఫ్ సిరీస్ తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా కావడంతో ‘సలార్’కి అంత క్రేజ్ వచ్చింది. హ్యాట్రిక్ సాధించేందుకు సిద్ధంగా ఉన్న షారూక్ కలెక్షన్లు కొల్లగొడతాడని, ప్రభాస్‌కి గట్టిపోటీ ఇస్తాడని అందరూ భావించారు.
అయితే ఈరోజు రిలీజ్ అయిన ‘డంకీ’ చిత్రానికి డివైడ్ టాక్ వస్తోంది. ‘డంకీ’ మూవీలో ఉన్న ఎమోషన్ క్లిక్ అయితే బాక్స్ ఆఫీస్ వద్ద సలార్ మూవీని ఎక్కడ డామినేట్ చేస్తుందో అన్న టెన్షన్ నిన్నటి వరకు అటు సలార్ బయ్యర్స్‌కి ఎక్కువగానే ఉంది. కానీ డంకీ మూవీ టాక్ అటు ఇటుగా ఉండడంతో సలార్‌దే పై చేయి అవుతుందని అందరూ నిర్ణయానికి వచ్చారు. బాక్సాఫీస్‌ను కొల్లగొట్టేందుకు ప్రభాస్‌కి ఇదే సరైన ఛాన్స్ అంటున్నారు. సలార్‌కి డంకీ ఏమాత్రం పోటీ కాదని విశ్లేషకులు చెబుతున్నారు. సినిమా అనుకున్నంత స్థాయిలో లేదని, పైగా రాజ్ కుమార్ హిరాని గత చిత్రాలతో పోల్చితే ఇది అంత గొప్ప సినిమా కాదని తేల్చేస్తున్నారు. కథ బాగానే ఉన్నా.. కథనం చాలా సిల్లీగా ఉందనే వాదన వినిపిస్తోంది. షారూక్‌ఖాన్ పెర్‌ఫార్మెన్స్ అద్భుతంగా ఉన్నప్పటికీ ఎమోషన్ పెద్దగా కనెక్ట్ అవ్వలేదంటున్నారు. ప్రస్తుతం సలార్‌కి ఉన్న క్రేజ్ దృష్ట్యా బాక్సాఫీస్ వద్ద డైనోసార్ దెబ్బకి డంకీ కొట్టుకుపోవడం ఖాయమని ఫ్యాన్స్ చెబుతున్నారు. అంతేకాదు సలార్ లాంటి మాస్ మూవీకి పోటీగా డంకీ లాంటి ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ మూవీని దించడం కరెక్ట్ కాదని విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఇది సలార్‌కి ఎంతవరకు ప్లస్ అవుతుంది, ప్రభాస్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడు అనేది తెలుసుకోవాలంటే షోలు పడే వరకు వెయిట్ చెయ్యాల్సిందే.
![]() |
![]() |