![]() |
![]() |

2023 వ సంవత్సరంలో తెలుగు సినిమా కలెక్షన్ల గురించి అంతర్జాతీయంగా చర్చ జరగలేదని అనుకుంటున్న వేళ డిసెంబర్ ఎండింగ్ లో సలార్ రిలీజ్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్ తో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచింది. ఈ రోజుకి సలార్ సాధించిన సాధించబోయే రికార్డుల గురించి చర్చ జరుగుతు ఉందనే సలార్ ఎంతటి ఘన విజయం సాధించిందో అర్ధం చేసుకోవచ్చు. తాజాగా సలార్ కలెక్షన్స్ కి సంబంధించిన ఒక వార్త ప్రభాస్ ఫ్యాన్స్ లో ఆనందాన్ని నింపుతుంది.
సలార్ ఇప్పుడు హిందీ చిత్ర సీమలో 200 కోట్ల రూపాయల మేర వసూళ్లను రాబట్టే దిశగా ముందుకు దూసుకెళ్తుంది. కేవలం మరికొద్ది రోజుల్లో 200 మార్క్ ని సలార్ అందుకోబోతుంది. షారూఖ్ ఖాన్ డంకీ నుంచి సలార్ కి గట్టి పోటీ వచ్చినప్పటికీ సలార్ తన సత్తా చాటడం సినీ వర్గాల వారిని విస్మయ పరుస్తున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే 200 కోట్లు కాదు ఇంకా రికార్డ్ స్థాయి కలెక్షన్స్ ని సాధిస్తుందని అంటున్నారు
ప్రశాంత్ నీల్ దర్శకత్వానికి తోడు ప్రభాస్ ఎనర్జిటిక్ నటన తోడవ్వడంతో సలార్ ఘన విజయం సాధించింది.అలాగే శృతి హాసన్, పృథ్వీ రాజ్, జగపతి బాబు, శ్రియా రెడ్డి, ఈశ్వరి రావు తదితరులు కూడా తమ పాత్ర పరిధి మేరకు అధ్బుతంగా నటించారు.
![]() |
![]() |