![]() |
![]() |

ఈ యుగం పుట్టినప్పటి దగ్గరనుంచి ఎన్ని సునామీలు వచ్చాయో తెలియదు గాని ఇప్పుడు మాత్రం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఒక సరికొత్త సునామి వచ్చింది. ఆ సునామి పేరు సలార్ సునామి. ప్రభాస్ అనే ఒక తెలుగు హీరో ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన ప్యూర్ పర్ఫెక్ట్ సునామి.అలాగే ఈ సునామీతో ఇండియా వైడ్ గా ప్రభాస్ కి అంత క్రేజ్ ఎందుకు ఉంటుందనే విషయం మరో సారి క్లియర్ గా అర్ధమైంది.
సలార్ మొదటి రోజు ప్రంపంచ వ్యాప్తంగా 180 కోట్ల గ్రాస్ ని సాధించింది. ఇండియాలో 135 కోట్లు. విదేశాల్లో 45 కోట్లు దాకా వసూళ్లు సాధించినట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. పైగా ఈ మొత్తంలో అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే సగం వచ్చినట్టు చెప్తున్నారు. అలాగే ఇండియాలోనే అత్యథిక వసూళ్లు సాధించిన మొట్టమొదటి సినిమాగా కూడా సలార్ రికార్డు సృష్టించింది. సినిమాకి ఇప్పుడు ఎలాగు పాజిటివ్ టాక్ ఉంది కాబట్టి ఈ శని, ఆదివారాల్లో బాక్స్ ఆఫీస్ ని ప్రభాస్ చెడుగుడు ఆడటం ఖాయం. అలాగే మరిన్ని రికార్డులని తన ఖాతాలో వేసుకోవడం కూడా ఖాయం
![]() |
![]() |