![]() |
![]() |

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కి ఇండియా వైడ్ గా ఉన్న చరిష్మా గురించి అందరికి తెలిసిందే. అలాగే తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి నట వారసత్వానికి ఈసమంతైనా డామేజ్ కలిగించకుండా తండ్రిని మించిన తనయుడిగా కూడా చరణ్ కీర్తిని గడించాడు. ఆయన తాజాగా తన సతీమణి ఉపాసన తో కలిసి మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడం ఇప్పుడు ప్రాధాన్యతని సంతరించుకుంది.
చరణ్ అండ్ ఉపాసనలు నిన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాద్ షిండే ని కలిశారు. చరణ్ దంపతులని స్వయంగా ఏక్ నాద్ షిండే తన ఇంట్లోకి ఆహ్వానించారు. ఆ తర్వాత చరణ్ ని శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందించారు. అలాగే వినాయకుడి ప్రతిమని కూడా చరణ్ కి బహుమతిగా ఇచ్చారు. అనంతరం ఇద్దరు కలిసి కొంచం సేపు ముచ్చటించిన తర్వాత అందరు కలిసి లంచ్ కూడా చేసారు.చరణ్ దంపతులు మర్యాదపూరకంగా సీఎంని కలిసారా లేక ఇంకేదయినా కారణమా అనేది మాత్రం ఎవరికి తెలియదు.
ఇక చరణ్ సినిమాల విషయానికి వస్తే ఆయన తాజాగా గేమ్ ఛేంజర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇండియన్ గ్రేటెస్ట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం లో వస్తున్న ఆ మూవీ మీద మెగా అభిమానుల్లోను, ప్రేక్షకుల్లోను భారీ అంచనాలే ఉన్నాయి. మూవీ ప్రారంభం అయ్యి రెండు సంవత్సరాల పైనే కావస్తుంది. కానీ ఎప్పటికప్పుడు ఏదో ఒక కారణంతో షూటింగ్ లేట్ అవుతు వస్తుంది. శంకర్ దర్శకత్వంలో చరణ్ ఎలా నటించాడో చూడాలని మెగా ఫాన్స్ అయితే గేమ్ ఛేంజర్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.
![]() |
![]() |