![]() |
![]() |

కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు అనే డైలాగ్ ని ప్రభాస్ ఒక సినిమాలో చెప్తాడు. ఇప్పుడు ఆ డైలాగ్ కి తగ్గట్టు ప్రభాస్ నయా మూవీ సలార్ కి మేకర్స్ ఎలాంటి ప్రమోషన్స్ ని కల్పించకపోయినా కూడా సలార్ రోజుకో కొత్త రికార్డు తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది.
రెండు రోజుల క్రితం ప్రారంభం అయిన సలార్ అడ్వాన్స్ బుకింగ్ టికెట్స్ ఒక సునామీని తలపించేలా బుక్ అయ్యాయి. మల్టిప్లెక్స్ థియేటర్లలో అగ్రగామిగా ఉన్న పివిఆర్, ఐనాక్స్, సినీ పోలీస్ లాంటి వాటితో సంబంధం లేకుండా సలార్ అడ్వాన్స్ బుకింగ్ సునామి ఈ విధంగా ఉంది.
ఆంధ్రప్రదేశ్: 13.25 లక్షలు
తెలంగాణ : 6 లక్షలు
నార్త్ ఇండియా : 5.25 లక్షలు
కర్ణాటక: 3.25 లక్షలు
కేరళ: 1.5 లక్షలు
తమిళనాడు: 1 లక్ష ఇలా ఇండియా వైడ్ గా మొత్తం కలిపి 30.25 లక్షల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. అలాగే మరికొన్ని స్క్రీన్స్ ల్లో కూడా సలార్ మూవీ అడ్వాన్స్ బుకింగ్ టికెట్స్ ఓపెన్ కానున్నాయి. ఇప్పుడు ప్రభాస్ సృష్టించిన సరికొత్త రికార్డుతో ప్రభాస్ ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ వచ్చింది. అలాగే సలార్ సినిమా విషయంలో ఆ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ కి మధ్య పివిఆర్, ఐనాక్స్, సినీ పోలీస్ యజమాన్యాలకి మధ్య ఉన్న గొడవలు సద్దుమణగాలని కోరుకుంటున్నారు.
![]() |
![]() |