![]() |
![]() |

ప్రభాస్ లేటెస్ట్ మూవీ 'సలార్' బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన ఈ యాక్షన్ ఫిల్మ్ డిసెంబర్ 22న విడుదలైంది. భారీ వసూళ్లతో మొదటి వారం పూర్తి చేసుకున్న ఈ సినిమా, రెండో వారంలోనూ అదే జోరు చూపిస్తోంది.
పది రోజుల్లో నైజాంలో రూ.65.25 కోట్ల షేర్, సీడెడ్ లో రూ.18.78 కోట్ల షేర్, ఆంధ్రాలో రూ.51.59 కోట్ల షేర్ రాబట్టిన సలార్.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి ఇప్పటిదాకా రూ.135.62 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక కర్ణాటక రూ.20.85 కోట్ల షేర్, తమిళనాడు రూ.10.55 కోట్ల షేర్, కేరళ రూ.6.25 కోట్ల షేర్, హిందీ+రెస్టాఫ్ ఇండియా రూ.62.35 కోట్ల షేర్, ఓవర్సీస్ లో రూ.59.25 కోట్ల షేర్ కలిపి.. పది రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.294.87 కోట్ల షేర్ రాబట్టింది.
ప్రపంచవ్యాప్తంగా రూ.345 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన సలార్.. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా రూ.51 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. పదో రోజైన ఆదివారం వరల్డ్ వైడ్ గా రూ.10.27 కోట్ల షేర్ రాబట్టిన ఈ చిత్రం.. 11వ రోజు న్యూ ఇయర్ కావడంతో మరో రూ.10 కోట్ల షేర్ రాబట్టి, రూ.300 కోట్ల షేర్ క్లబ్ లో చేరే ఛాన్స్ ఉంది. ఇదే జోరు కొనసాగితే త్వరలోనే సలార్ మూవీ బ్రేక్ ఈవెన్ కి చేరువయ్యే అవకాశముంది.
సలార్ మూవీ 10 రోజుల వసూళ్లు:
నైజాం: రూ.65.25 కోట్ల షేర్
సీడెడ్: రూ.18.78 కోట్ల షేర్
ఆంధ్రా: రూ.51.59 కోట్ల షేర్
తెలుగు రాష్ట్రాల వసూళ్లు: రూ.135.62 కోట్ల షేర్
కర్ణాటక: రూ.20.85 కోట్ల షేర్
తమిళనాడు: రూ.10.55 కోట్ల షేర్
కేరళ: రూ.6.25 కోట్ల షేర్
హిందీ+రెస్టాఫ్ ఇండియా: రూ.62.35 కోట్ల షేర్
ఓవర్సీస్: రూ.59.25 కోట్ల షేర్
ప్రపంచవ్యాప్తంగా పది రోజుల వసూళ్లు: రూ.294.87 కోట్ల షేర్
![]() |
![]() |