![]() |
![]() |

పవన్ కళ్యాణ్ ఖుషి, మహేష్ ఒక్కడు,ఎన్టీఆర్ సింహాద్రి సినిమాల్లో హీరోయిన్ గా చేసి ఆయా హీరోలకి మోస్ట్ లక్కియస్ట్ హీరోయిన్ గా మిగలడమే కాకుండా ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల గుండెల్లో అభిమాన కథానాయకిగా మారిన నటి భూమిక చావ్లా. హీరోయిన్ గా మంచి ఫామ్ ని కొనసాగిస్తున్నప్పుడే వివాహం చేసుకున్న భూమిక కి సంబంధించిన ఒక విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది..
భూమిక తాజాగా హోటల్ రంగంలోకి అడుగుపెట్టింది. నిత్యం పర్యాటకులతో బిజీగా ఉండే గోవాలో భూమిక ఒక హోటల్ ని ప్రారంభించింది. తన భర్త కొడుకుతో కలిసి ఆమె హోటల్ ని ప్రారంభించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టిస్తున్నాయి. అలాగే వాటి తాలూకు పిక్స్ ని భూమిక తన ఇనిస్టాగ్రమ్ లో షేర్ చేస్తే ఆమెకి అభిమానులు బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నారు.
భూమిక తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా తెలుగు హిందీ భాషల్లో మంచి మంచి క్యారెక్టర్స్ వేస్తు ప్రేక్షకుల మనసుని చూరగొంటుంది. భూమిక ప్రస్తుతం కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఎమర్జన్సీ చిత్రంలో ఒక పవర్ ఫుల్ పాత్రలో నటిస్తుంది. త్వరలోనే ఆ చిత్రం విడుదల కాబోతుంది.
![]() |
![]() |