![]() |
![]() |

టాలీవుడ్ లో భారీ చిత్రాల దర్శకుడు అనగానే గుర్తుకొచ్చే పేరు ఎస్.ఎస్. రాజమౌళి. 'బాహుబలి' ఫ్రాంచైజ్, 'ఆర్ఆర్ఆర్'తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు జక్కన్న. సుకుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. 'పుష్ప-1'తో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న సుకుమార్.. 'పుష్ప-2'తో సంచలనాలు సృష్టించాలని చూస్తున్నాడు. ఇక రీజినల్ సినిమాలతో సంచలనాలు సృష్టిస్తున్న త్రివిక్రమ్.. 'గుంటూరు కారం' తర్వాత అల్లు అర్జున్ తో చేయబోయే ప్రాజెక్ట్ తో పాన్ ఇండియా మార్కెట్ పై కన్నేశాడు. ఆ తర్వాత నుంచి వరుస భారీ సినిమాలు చేయాలని చూస్తున్నాడు. అయితే వీరిద్దరి కంటే ముందే కొరటాల శివ పాన్ ఇండియా రేంజ్ లో సంచలనాలు సృష్టించడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి.
.webp)
'మిర్చి' వంటి సూపర్ హిట్ తో దర్శకుడిగా పరిచయమైన కొరటాల శివ.. 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్', 'భరత్ అనే నేను' వంటి వరుస విజయాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఐదో సినిమా 'ఆచార్య' రూపంలో ఘోర పరాజయం ఎదురైనప్పటికీ.. కొరటాల ప్రతిభ మీద ఉన్న నమ్మకంతో ఆయన దర్శకత్వంలో 'దేవర' వంటి భారీ సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు జూనియర్ ఎన్టీఆర్. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా అనౌన్స్ మెంట్ వీడియోతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు కొరటాల. ఫస్ట్ లుక్ తో పాటు, తాజాగా విడుదల చేసిన గ్లింప్స్ అప్డేట్ పోస్టర్, ఇప్పటిదాకా విడుదలైన ఇతర ప్రచార చిత్రాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక జనవరి 8న విడుదల కానున్న దేవర గ్లింప్స్ తో కొరటాల అందరినీ సర్ ప్రైజ్ చేయడం ఖాయమని అంటున్నారు. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్టుగా.. ఇందులో రాజమౌళిని తలపించేలా కొరటాల మేకింగ్ ఉంటుందని చెబుతున్నారు. గ్లింప్స్ విడుదల తర్వాత.. టాలీవుడ్ ప్రైడ్ మూవీస్ లో ఒకటిగా దేవర మారడం ఖాయమని, దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల దృష్టి ఒక్కసారిగా ఈ సినిమాపై పడుతుందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అదే నిజమైతే పాన్ ఇండియా వైడ్ గా కొరటాల పేరు మారుమోగిపోవడం ఖాయం.
![]() |
![]() |