![]() |
![]() |

తెలుగు సినిమా రంగంలో సిల్వర్ స్క్రీన్ మీద కమర్షియల్ కామెడీ ని పండించడంలో ఒక ట్రెండ్ సృష్టించిన దర్శకుడు శ్రీను వైట్ల.ఈయన సినిమాల్లో ఉండే కామెడీ కి పొట్టచెక్కలయ్యేలా నవ్వని ప్రేక్షకుడు లేడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఢీ, వెంకీ, దుబాయ్ శ్రీను, రెడీ, దూకుడు, బాద్ షా, నమో వెంకటేష్ లాంటి మూవీలు కామెడీకి సంబంధించి తెలుగు చిత్ర సీమలో ఒక సంచలనాన్ని క్రియేట్ చేసాయి. నేటికీ ఆయన సినిమాల్లోని కామెడీ యాక్టర్స్ పేర్లని చాలా మంది తలచుకుంటునే ఉంటారు. తాజాగా ఆయన సినిమాకి సంబంధించిన క్రేజీ న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది.
శ్రీను వైట్ల తాజాగా గోపీచంద్ తో ఒక మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే ప్రారంభం అయిన ఆ చిత్రంలో శ్రీను వైట్ల తన గత చిత్రం వెంకీ మూవీలో ఉన్న ట్రైన్ ఎపిసోడ్ ని గోపి చంద్ సినిమాలో కూడా పెట్టబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా శ్రీను వైట్లనే చెప్పాడు. ఇటీవలే వెంకీ సినిమా రీ రిలీజ్ జరిగింది. రవి తేజ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఆ సినిమాలోని ట్రైన్ ఎపిసోడ్ ని తెగ ఎంజాయ్ చేసారు. పైగా వాటి తాలూకు వీడియోస్ ని సోషల్ మీడియా లో కూడా పోస్ట్ చేసారు. ఆ వీడియోనే శ్రీను వైట్ల తన ట్విటర్ లో పోస్ట్ చేసి గోపీచంద్ సినిమాలో కూడా ట్రైన్ ఎపిసోడ్ ఉండబోతుందని చెప్పాడు.
శ్రీను వైట్ల గత కొంత కాలంగా వరుస పరాజయాలతో ఉన్నాడు. ఈ సారైనా గోపి చంద్ సినిమాతో శ్రీను వైట్ల హిట్ కొట్టి మరిన్ని విజయవంతమైన చిత్రాలని తెరకెక్కించడమే కాకుండా తన మార్క్ కామెడీ తో ప్రేక్షకులని ఆనందింపచేయాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.
![]() |
![]() |