![]() |
![]() |

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 15వ సినిమా 'గేమ్ ఛేంజర్'ని శంకర్ దర్శకత్వంలో చేస్తున్నాడు. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్. ఇప్పటివరకు సగానికి పైగా షూటింగ్ పూర్తయిందని సమాచారం. అయితే దర్శకుడు శంకర్ 'ఇండియన్-2'తో బిజీగా ఉండటంతో.. 'గేమ్ ఛేంజర్' షూటింగ్ ఆలస్యమవుతోంది. దీంతో తన తదుపరి సినిమా షూటింగ్ మొదలుపెట్టాలని చరణ్ చూస్తున్నాడు.
రామ్ చరణ్ తన 16వ సినిమాని 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో చేయనున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో సుకుమార్ రైటింగ్స్ తో కలిసి వృద్ధి సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందనున్న ఈ మూవీని జనవరి నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా హీరోయిన్ ని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.
'RC 16'లో హీరోయిన్ గా మొదట జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ వంటి పేర్లు వినిపించాయి. అయితే ఇప్పుడు అనూహ్యంగా సాయి పల్లవిని ఎంపిక చేసినట్లు వినికిడి. సాయి పల్లవి గ్లామర్ రోల్స్ కి దూరం. కథా ప్రాధాన్యమున్న సినిమాలు, నటనకు ఆస్కారమున్న పాత్రలు చేయడానికి ఆమె ఎక్కువ ఆసక్తి చూపిస్తుంది. అలాంటి సాయి పల్లవి 'RC 16' నటిస్తుందంటే.. ఈ సినిమాలో కథతో పాటు, హీరోయిన్ పాత్ర కూడా బలంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు.
తెలుగులో సాయి పల్లవి ఓ స్టార్ హీరో పక్కన నటించనుండటం ఇదే తొలిసారి. ఇప్పటిదాకా ఆమె వరుణ్ తేజ్, నాని, శర్వానంద్, నాగ చైతన్య, రానా వంటి టైర్-2 హీరోల పక్కన నటించింది. మొదటిసారి చరణ్ వంటి బిగ్ స్టార్ పక్కన ఛాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈమధ్య దాదాపు స్టార్స్ అందరూ కంటెంట్ బేస్డ్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఈ సినిమా తర్వాత సాయి పల్లవికి స్టార్ హీరోల సినిమాల ఆఫర్లు క్యూ కడతాయేమో చూడాలి.
![]() |
![]() |