![]() |
![]() |

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రేమలో ఉన్నారని, త్వరలోనే వారి ప్రేమని అధికారికంగా ప్రకటించే అవకాశముందని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. పైకి విజయ్, రష్మిక తాము స్నేహితులమని చెప్తున్నప్పటికీ.. వారి చర్యలు మాత్రం ప్రేమ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. గతంలో సీక్రెట్ గా మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్ళారు. ఎయిర్ పోర్ట్ దగ్గర సెపెరేట్ గా వెళ్ళి.. వెకేషన్ ఫొటోలు సింగిల్ గా పోస్ట్ చేసినప్పటికీ.. లొకేషన్, బ్యాక్ గ్రౌండ్ తో ఇద్దరూ ఒకే దగ్గర ఉన్నారని అందరికీ అర్థమైపోయింది. తాజాగా ఇలాంటి ఫొటోల వల్లే విజయ్-రష్మిక జంట మరోసారి దొరికిపోయింది.

దీపావళి సందర్భంగా అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతూ "Happy Diwali my loves" అంటూ సోషల్ మీడియా వేదికగా రష్మిక ఓ ఫొటో షేర్ చేసింది. అందులో రష్మిక.. ఇంటి దగ్గర బెంచ్ మీద కూర్చొని ఫొటోకి స్టిల్ ఇచ్చినట్టుగా ఉంది. ఇక రష్మిక పోస్ట్ చేసిన కాసేపటికే.. విజయ్ కూడా "Happy Diwali my loves" అంటూ తన ఫ్యామిలీతో దిగిన ఫొటోని షేర్ చేశాడు. తన తల్లిదండ్రులు, తమ్ముడు ఆనంద్ తో కలిసి ఇంటి వరండాలో మెట్ల మీద కూర్చొని ఫొటోకి ఫోజిచ్చాడు. అయితే ఈ రెండు ఫొటోలను గమనిస్తే.. విజయ్ ఇంట్లో రష్మిక దీపావళి సెలెబ్రేట్ చేసుకుందని అర్థమైపోతుంది. విజయ్ పక్కనున్న గోడ, రష్మిక ఫొటోలో కూడా ఉంది. అలాగే విజయ్ వెనక ఒక బెంచ్ కొద్దిగా కనిపిస్తుండగా.. రష్మిక ఫొటోలో ఆమె అదే బెంచ్ లో కూర్చున్నట్టు గమనించవచ్చు. మొత్తానికి ఈ ఫొటోల వల్ల విజయ్ ఫ్యామిలీతో కలిసి రష్మిక దీపావళి సెలెబ్రేట్ చేసుకుందని తెలిసిపోయింది. పైగా విజయ్, రష్మిక కూడా "Happy Diwali my loves" అంటూ ఒకటే టెక్స్ట్ రాసి, హింట్ ఇచ్చినట్టుగా కూడా ఉంది.

![]() |
![]() |