![]() |
![]() |

ప్రస్తుతం సోషల్ మీడియాని ఒక ఫొటో ఊపేస్తోంది. టాలీవుడ్ కి చెందిన నలుగురు స్టార్స్ ఒకే ఫొటోలో దర్శనమిచ్చారు. ఆ నలుగురు స్టార్లు ఎవరో కాదు.. జూనియర్ ఎన్టీఆర్, వెంకటేష్, రామ్ చరణ్, మహేష్ బాబు. అసలు ఈ నలుగురు ఎక్కడ కలిశారు? ఎప్పుడు కలిశారు? అంటూ అభిమానులు ఆరాతీయడం మొదలుపెట్టారు.
దీపావళి సందర్భంగా రామ్ చరణ్-ఉపాసన దంపతులు ప్రత్యేక పార్టీని నిర్వహించారు. మెగా ఇంట జరిగిన ఈ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగానే వెంకటేష్, ఎన్టీఆర్, మహేష్, చరణ్ ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ నలుగురి మధ్య మంచి అనుబంధం ఉంది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'లో పెద్దోడుగా వెంకటేష్, చిన్నోడుగా మహేష్ నటించగా.. 'ఆర్ఆర్ఆర్'లో రామ్ గా చరణ్, భీమ్ గా ఎన్టీఆర్ నటించారు. అయితే ఇప్పుడు ఈ నలుగురు పెద్దోడితో భీమ్, చిన్నోడితో రామ్ అన్నట్టుగా ఫొటోకి ఫోజు ఇచ్చారు.

ఇక ఈ పార్టీలో మహేష్ భార్య నమ్రత, ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి, అల్లు అర్జున్ భార్య స్నేహ కూడా పాల్గొన్నారు. వీరు ఉపాసనతో కలిసి ఫొటోలు దిగగా.. అవి కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
![]() |
![]() |