![]() |
![]() |

చాలా గ్యాప్ తర్వాత మహేష్ బాబు నటిస్తున్న పర్ఫెక్ట్ మాస్ ఎంటర్టైనర్ 'గుంటూరు కారం'. హారిక & హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. 'అతడు', 'ఖలేజా' సినిమాల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో 'గుంటూరు కారం'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కి, ధమ్ మసాలా సాంగ్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. 2024 సంక్రాంతికి విడుదల కానున్న ఈ మూవీపై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే విడుదలకు రెండు నెలల ముందే థియేట్రికల్ బిజినెస్ ఓ రేంజ్ లో జరిగినట్లు తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లోనే 'గుంటూరు కారం' వంద కోట్లకు పైగా బిజినెస్ చేసినట్లు సమాచారం. నైజాం(తెలంగాణ)లో రూ.45 కోట్లు, ఆంధ్రాలో రూ.50 కోట్లు, సీడెడ్ లో రూ.15 కోట్ల బిజినెస్ చేసిందట. అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రూ.110 కోట్ల బిజినెస్ చేసిందన్నమాట. ఇక కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ కలిపి మరో రూ.30 కోట్ల దాకా బిజినెస్ జరిగినట్టు టాక్. ఈ లెక్కన ప్రపంచవ్యాప్తంగా రూ.140 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నంబర్స్ ప్రకారం చూస్తే, ఈ సినిమా హిట్ స్టేటస్ దక్కించుకోవాలంటే రూ.140 కోట్లకు పైగా షేర్ రాబట్టాల్సి ఉంది. హిట్ టాక్ వస్తే మహేష్ వంటి స్టార్ కి సంక్రాంతి సీజన్ లో రూ.140 కోట్ల షేర్ రాబట్టడం పెద్ద విషయమేమి కాదు.
![]() |
![]() |