![]() |
![]() |

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్, మహారాష్ట్రలో అధికార శివసేన పార్టీ మధ్య జరుగుతున్న యుద్ధం సరికొత్త మలుపు తీసుకుంది. ఇద్దరి మధ్య పెట్రోల్ పోయకుండానే మంటలు అంటుకుంటున్నాయి. కంగనాపై శివసేనకి చెందిన ఐటీ విభాగం ముంబైలోని థానే పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. దేశద్రోహానికి పాల్పడినట్టు ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరింది.
కొన్ని రోజులుగా కంగనా వ్యాఖ్యలపై ఆమెకు, శివసేన పార్టీకి మధ్య మాటల యుద్ధం జరుగుతన్న సంగతి తెలిసిందే. కేసుతో అది కొత్త మలుపు తీసుకుంది. ముంబైలోని కంగనా రనౌత్ ఆఫీసుకు ముంబై మహానగర పాలక సంస్థ అధికారులు వెళ్లి వచ్చిన మరుసటి రోజు ఈ కేసు నమోదు కావడం గమనించదగ్గ అంశం. నిబంధనలకు లోబడి ఆఫీసు కట్టినప్పటికీ వేధిస్తున్నారని కంగనా ట్వీట్లు చేశారు.
ముంబైని పాక్ ఆక్రమిత కాశ్మీర్‌తో కంగనా పోల్చడమే ఈ వివాదాలు అన్నిటికీ కారణం. ఆల్రెడీ ఆమెను మెంటల్ మహిళగా శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పేర్కొన్నారు. శివసేన కార్యకర్తలు అయితే నిప్పులు చెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు కేంద్ర ప్రభుత్వం 10 మంది కమాండోలతో ‘వై’ కేటగిరీ భద్రత కల్పిస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.
![]() |
![]() |