![]() |
![]() |

పందొమ్మిది గంటల సేపు సునిశితంగా ప్రశ్నించిన అనంతరం డ్రగ్ కేసులో రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మంగళవారం అరెస్ట్ చేసింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులు ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రియాను ఫార్మాలిటీస్‌లో భాగంగా సాయంత్రం 4 గంటలకు వైద్య పరీక్షలు చేయించారు.
ఎన్‌సీబీ నిర్వహించిన మూడో రోజు ఇంటరాగేషన్‌లో రియా చక్రవర్తి తాను కేవలం గంజాయిని మాత్రమే కాకుండా, హార్డ్ డ్రగ్స్ కూడా వాడినట్లు అంగీకరించిందని సమాచారం. అంతకు ముందు తన తమ్ముడు షోవిక్‌తో కలిసి తాను డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు ఆమె అంగీకరించింది. షోవిక్‌ను ఇదివరకే ఎన్‌సీబీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్లలో ఎవరెవరు డ్రగ్స్ వాడుతున్నదీ బయటపెట్టిన ఆమె, ఇప్పుడు తను కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు ఒప్పుకోవడం ఈ కేసును మరో మలుపు తిప్పింది.
![]() |
![]() |