![]() |
![]() |

పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌కి నితిన్ వీరాభిమాని. అతనిది చొక్కాలు చింపుకునేంత అభిమానం. పవన్ మీద తన అభిమానం చాటుకోవడానికి నితిన్ ఏమాత్రం సంకోచించడు. మెగా ఫ్యామిలీ, మెగా హీరోలతో అతనికి మంచి అనుబంధం ఉంది. పెళ్లి సాక్షిగా మరోసారి అది బయటపడింది.
కరోనా నేపథ్యంలో పెళ్లికి పరిమిత సంఖ్యలో అతిథులను ఆహ్వానించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందువల్ల, సన్నిహితులకు మాత్రమే ఆహ్వానాలు వెళుతున్నాయి. ఒకవేళ ఎవరైనా పిలిచినా... తమకు సన్నిహితులు అనుకుంటేనే ఆహ్వానాలు అందుకున్నవాళ్ళు వెళుతున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అతికొద్ది మందికి మాత్రమే నితిన్ పెళ్లి పిలుపు వెళ్ళింది. అందులో మెగా ఫ్యామిలీ ఉంది.
నితిన్ పెళ్లి కొడుకు ఫంక్షన్‌కి పవన్ కల్యాణ్, ఆయన ఆప్తమిత్రుడు త్రివిక్రమ్ వెళ్ళారు. ఆశీర్వదించి వచ్చారు. పెళ్ళికి మెగా హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ వెళ్ళారు. వీళ్ళిద్దరూ నితిన్ కి క్లోజ్. పెళ్ళిలో సందడి చేశారని సమాచారం. నితిన్ పెళ్లి సాక్షిగా అతడి 'మెగా' బంధం మరోసారి ప్రేక్షకులు అందరికీ తెలిసింది.
![]() |
![]() |