![]() |
![]() |

ప్రముఖ నటి రేణూ దేశాయ్ కి వింత అనుభవం ఎదురైంది. తన మొబైల్ లో ఓ బ్యాంకింగ్ యాప్ ద్వారా తన అకౌంట్ లోకి లాగిన్ అవ్వాలని ప్రయత్నించగా.. అది వేరొకరి అకౌంట్ లోకి లాగిన్ అయింది. దీంతో షాకైన రేణూ.. ఆ బ్యాంక్ భద్రతపై అనుమానాలు ఉన్నాయని, ఆ బ్యాంక్ అకౌంట్ ని క్లోజ్ చేస్తున్నానని తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
రేణూ దేశాయ్ ఇండస్ ఇండ్ బ్యాంకు మొబైల్ యాప్ లోకి లాగిన్ అయినప్పుడు.. అది వేరొకరి అకౌంట్ లోకి లాగిన్ అయిందట. ఆ అకౌంట్ కి చెందిన పూర్తి వివరాలు కూడా ఆమెకి కనిపించాయట. దీంతో షాక్ అయిన ఆమె హెల్ప్ లైన్ నంబర్ కు ఫోన్ చేయగా.. వారి నుండి సరైన స్పందన లేదట. కస్టమర్లకు ఆ బ్యాంకు ఇస్తున్న భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన రేణూ.. ఈ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. అంతేకాదు ఆ బ్యాంక్ లో ఉన్న తన అకౌంట్‌ను సోమవారం క్లోజ్ చేయబోతున్నట్టు ఆమె వెల్లడించారు.

రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. బ్యాంకింగ్ భద్రతాలోపాలపై విమర్శలు గుప్పిస్తూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరికొంతమంది ‘డిజిటల్ ఇండియా’ అంటూ సెటైర్స్ వేస్తున్నారు. మరి ఈ వ్యవహారంపై ఇండస్ ఇండ్ బ్యాంకు ఎలా స్పందిస్తుందో చూడాలి.
![]() |
![]() |