Home

»

Latest News

గెటప్ శీనుతో కలిసి ఆడిషన్స్ కి వెళ్ళేవాడిని!

Nov 12, 2023 11:53AM

‘మా ఊరి పొలిమేర’కి సీక్వెల్ గా రూపొందిన ‘మా ఊరి పొలిమేర 2’ ఇటీవల విడుదలై ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకకు టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.

‘మా ఊరి పొలిమేర 2’  సక్సెస్ మీట్ లో శ్రీ విష్ణు మాట్లాడుతూ గెటప్ శీనుతో పాటు ఆ మూవీలో నటించిన అందరితో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. "15 ఏళ్ళ క్రితం నేను, గెటప్ శ్రీను ఆడిషన్స్‌కి తిరిగేవాళ్లం. నేను ఫస్ట్ యాక్ట్ చేసిన పెద్ద యాక్టర్ సత్యం రాజేష్ అన్న. ఫస్ట్ డే షూట్ అయ్యాక అన్న నన్ను పిలిచి గ్యారెంటీగా హీరోవి అవుతావు  అన్నారు. ఆయన అన్న మాటలు నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. చిత్రం శ్రీనుతో కలిసి రెండు సినిమాలలో పని చేశాను. తామిద్దరం రూమ్ మేట్స్ అయ్యామని శ్రీవిష్ణు చెప్పారు. చిత్రం శ్రీనుతో పాటు తనతో నటించినవాళ్లంతా అప్పటికే చాలా సీనియర్లని.. వాళ్లంతా తనకు మంచి చెడులు చెప్పేవారని, అవి ఇప్పటికీ నేను గుర్తుంచుకున్నాను. పోలిమేర 2 అనేది చాలా పెద్ద సినిమా. కొన్ని సినిమాలు బాగున్నా థియేట‌ర్స్‌లో ఆడ‌వు అలాంటిది ఈ సినిమా వ‌ర‌ల్డ్‌క‌ప్ జ‌ర‌గుతున్న స‌మ‌యంలో ఇంత మంచి క‌లెక్ష‌న్స్‌తో విజ‌యవంతంగా ఆడ‌టం గొప్ప విష‌యం" అని టీంని అభినందించాడు శ్రీవిష్ణు.

ఈ సస్పెన్స్‌ అండ్‌ హార్రర్‌ థ్రిల్లర్‌ మూవీ ఈ నెల చివరిలో కానీ డిసెంబర్ మొదటి వారంలో కానీ  డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు రానుందని టాక్‌ వినిపిస్తోంది. కమెడియన్‌ సత్యం రాజేష్‌ లీడ్ రోల్ లో చేతబడుల నేపథ్యంలో సుమారు రెండేళ్ల క్రితం ఓటీటీలో రిలీజైన చిత్రం మా ఊరి పొలిమేర. హార్రర్‌ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ మూవీ సూపర్‌హిట్‌గా నిలిచింది. రికార్డు స్థాయిలో వ్యూస్‌ సొంతం చేసుకుని ఇప్పుడు సీక్వెల్‌ తో కూడా థియేటర్స్ లో దుమ్ము రేపుతోంది.  మా ఊరి పొలిమేర 2  కూడా  ఊహించని ట్విస్టులతో సినిమా అదిరిపోయిందని ప్రశంసలు అందుకుంటోంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com