![]() |
![]() |

`ఒక్కడు మిగిలాడు` (2017) తరువాత మంచు మనోజ్ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం `అహం బ్రహ్మాస్మి`. పాన్ - ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వం వహించడమే కాకుండా కథ, కథనం, మాటలు అందిస్తున్నారు. ఎం.ఎం. ఆర్ట్స్ పతాకంపై నిర్మలా దేవి మంచు, మంచు మనోజ్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ.. చిత్రీకరణ దశలో ఉంది.
ఇదిలా ఉంటే.. `అహం బ్రహ్మాస్మి`లో `సుప్రీమ్` హీరో సాయితేజ్ అతిథి పాత్రలో దర్శనమివ్వనున్నాడని కథనాలు వస్తున్నాయి. పాత్ర నిడివి తక్కువే అయినా.. సినిమాని మలుపు తిప్పే పాత్ర ఇదని సమాచారం. మంచు మనోజ్ తో తనకున్న అనుబంధం రీత్యా ఈ క్యారెక్టర్ ని చేయడానికి వెంటనే అంగీకరించాడట సాయితేజ్. త్వరలోనే `అహం బ్రహ్మాస్మి`లో సాయితేజ్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తున్న `అహం బ్రహ్మాస్మి`కి అచ్చు రాజమణి, రమేశ్ తమిళ్ మణి సంగీతమందిస్తున్నారు. మరి.. చాన్నాళ్ళుగా సరైన విజయం లేని మంచు మనోజ్.. ఈ ప్రాజెక్ట్ తోనైనా సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి.
![]() |
![]() |