![]() |
![]() |

`సమరసింహారెడ్డి`తో తెలుగునాట ఫ్యాక్షన్ సినిమాల ట్రెండ్ ఊపందుకుంది. అంతకంటే ముందు `కడప రెడ్డమ్మ`, `ప్రేమించుకుందాం.. రా!`, `అంతఃపురం` చిత్రాల్లో ఈ అంశాన్ని స్పృశించినా.. `సమరసింహారెడ్డి`లో కథానాయకుడు ఫ్యాక్షనిస్ట్ కావడం ఈ తరహా చిత్రాలపై జనాల్లో మరింత ఆసక్తిని పెంచింది. అందుకే.. ఒక దశలో అగ్ర కథానాయకుల నుంచి యువ కథానాయకుల వరకు ఫ్యాక్షన్ మూవీస్ తో మెస్మరైజ్ చేశారు.
కట్ చేస్తే.. సుదీర్ఘ విరామం తరువాత తెలుగునాట మరో ఫ్యాక్షన్ డ్రామా రాబోతోంది. ఈ సారి.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఈ తరహా చిత్రంలో సందడి చేయనున్నారట. ఆ వివరాల్లోకి వెళితే.. కోలీవుడ్ కెప్టెన్ లింగుస్వామి దర్శకత్వంలో రామ్ తెలుగు, తమిళ భాషల్లో ఓ బైలింగ్వల్ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. ఊరమాస్ మూవీగా ప్రచారంలో ఉన్న ఈ సినిమాకి నేపథ్యం.. `ఫ్యాక్షన్` అని టాక్. అదే గనుక నిజమైతే.. `సండకోళి` (తెలుగులో `పందెంకోడి`) సిరీస్ తరువాత లింగుస్వామి చేసే ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ ఇదే అవుతుంది. మరి.. ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో రామ్ కి జోడీగా కృతి శెట్టి నటించనుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వరకర్త.
![]() |
![]() |