![]() |
![]() |

కింగ్ నాగార్జున, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో ఓ యాక్షన్ థ్రిల్లర్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో మాజీ `రా` ఏజెంట్ గా నాగ్ దర్శనమివ్వనున్నట్లు సమాచారం. అతనికి జోడీగా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కనిపించనుంది. ఆమె కూడా `రా` ఏజెంట్ రోల్ లో నటించనుందని టాక్.
ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన తొలి షెడ్యూల్ పూర్తయింది. కాగా, రెండో షెడ్యూల్ జూన్ ప్రథమార్ధంలో ప్రారంభం కానుంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో నిర్మిస్తున్న స్పెషల్ భారీ సెట్ లో ఈ షెడ్యూల్ జరుగనుందని.. అన్ని కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ చిత్రీకరణ సాగుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
కాగా, ఈ చిత్రంలో నాగ్ కి చెల్లెలుగా బాలీవుడ్ యాక్ట్రస్ గుల్ పనాగ్ నటిస్తుండగా.. ఓ కీలక పాత్రలో రష్మి గౌతమ్ సందడి చేయనుందని వినికిడి. ఈ చిత్రాన్ని నారాయణ దాస్ నారంగ్, రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి.. చాలా కాలంగా సరైన విజయం లేని నాగ్ కి ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.
![]() |
![]() |