![]() |
![]() |

యంగ్ హీరో శర్వానంద్ ఇటీవల 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో 'శ్రీకారం' సినిమా చేసిన సంగతి తెలిసిందే. మార్చ్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది కానీ వసూళ్ల పరంగా మాత్రం నిరాశ పర్చింది. దీంతో శర్వానంద్ కు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ లో నిర్మాతలు కోత కోసినట్లుగా తెలుస్తోంది. దీనిపై సీరియస్ అయిన శర్వానంద్ నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపించారని సమాచారం.
14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్స్ శ్రీకారం సినిమా కోసం శర్వానంద్ కి రూ .6 కోట్ల రెమ్యునరేషన్ చెల్లించడానికి అంగీకరించిందట. అయితే అందులో నాలుగు కోట్ల రెమ్యునరేషన్ ముందే ఇవ్వగా బ్యాలన్స్ కోసం ఇబ్బంది పెడుతున్నారని ప్రచారం జరుగుతోంది. సినిమా విడుదల సమయంలో బ్యాలన్స్ అమౌంట్ ఇవ్వాల్సిందిగా శర్వా కోరగా.. 50 లక్షల రూపాయలు ఇచ్చి మిగతావి మూవీ విడుదలైన వారం రోజుల్లో ఇస్తామంటూ హామీ ఇచ్చారట. కానీ ఇప్పటి వరకు ఆ మొత్తంను ఇవ్వక పోవడం, దానికితోడు నిర్మాతల నుంచి స్పందన సంతృప్తికరంగా లేని కారణంగా నోటీసులు పంపినట్లు తెలుస్తోంది.
ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం శర్వానంద్ అజయ్ భూపతి దర్శకత్వంలో 'మహా సముద్రం' చేస్తున్నాడు. 'ఆర్ఎక్స్ 100' హిట్ తర్వాత అజయ్ భూపతి చేస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ మూవీలో బొమ్మరిల్లు సిద్దార్థ్ కూడా నటిస్తున్నాడు.
![]() |
![]() |