![]() |
![]() |

ఒకవైపు టాలీవుడ్, మరోవైపు బాలీవుడ్ సినిమాలతో బిజీగా మారిన ఫిట్‌నెస్ క్వీన్ రకుల్‌ప్రీత్ సింగ్ తాజాగా మాల్దీవుల్లో సెలవుల్ని ఎంజాయ్ చేయడానికి వెళ్లింది. తన హాలిడే టైమ్‌ను ఎలా గడుపుతోందో తెలియజేసే ఓ పిక్చర్‌ను గురువారం తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఆమె షేర్ చేసింది. ఆ ఫొటోలో ఆమెను చూడ్డానికి రెండు కళ్లూ చాలవనిపిస్తుంది. గ్రీన్ స్విమ్‌సూట్, దానిపైన ప్రింటెట్ క్యాప్ ధరించి తల పైకెత్తి, కళ్లు మూసుకొని, ఆ అనుభవాన్ని ఆస్వాదిస్తున్నట్లుగా పోజ్ పెట్టింది రకుల్. దానికి "Smell the sea, feel the sky, let your soul and spirit fly." అని క్యాప్షన్ జోడించింది.

అంతకుముందు తన ఫ్యామిలీతో పాటు ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచ్చిన ఆమె, మాల్దీవుల్లో వారితో కలిసి దిగిన ఫొటోను సైతం తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ఆ ఫొటోలో ఆమె అమ్మానాన్నలతో పాటు తమ్ముడు అమన్‌ప్రీత్ కూడా ఉన్నాడు. ఆ ఫొటోకు "మామ్ డాడ్ లవ్ మి మోర్" అనే క్యాప్షన్ పెట్టింది.

తెలుగులో క్రిష్ డైరెక్షన్‌లో పంజా వైష్ణవ్ తేజ్ జోడీగా ఓ సినిమా చేస్తున్న రకుల్, బాలీవుడ్‌లో అర్జున్ కపూర్, జాన్ అబ్రహాం, అదితి రావ్ హైదరితో పాటు ఇంకా టైటిల్ ఖరారు చేయని ఓ క్రాస్ బోర్డర్ లవ్ స్టోరీలో, అజయ్ దేవ్‌గణ్ డైరెక్ట్ చేయనున్న 'మేడే' మూవీలో ఆయన సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. 'మేడే'లో అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు.
![]() |
![]() |