![]() |
![]() |

సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇటీవల యంగ్ డైరెక్టర్స్‌తో పనిచేస్తూ వస్తున్నారు. 'కబాలి', 'కాలా' లాంటి విమర్శకుల ప్రశంసలు పొందిన సినిమాలను పా. రంజిత్ దర్శకత్వంలో చేసిన ఆయన, కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్‌లో ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ హిట్ మూవీ 'పేట'ను చేశారు.
'కొలమావు కోకిల', 'డాక్టర్' లాంటి డార్క్ కామెడీలను రూపొందించి హిట్లు కొట్టిన నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్షన్‌లో 'తలైవర్ 169'ను చేయడానికి రజనీ ఇదివరకే అంగీకరించారు. ఆ మూవీని సన్ పిక్చర్స్ అనౌన్స్ చేసింది. అయితే విజయ్ హీరోగా నెల్సన్ రూపొందించిన రీసెంట్ ఫిల్మ్ 'బీస్ట్'కు మిక్స్‌డ్ రివ్యూస్ వచ్చాయి. బాక్సాఫీస్ దగ్గర కూడా ఆ సినిమా ఆశించిన రీతిలో ఆడట్లేదు. తమిళం తప్పిస్తే, మిగతా భాషల్లో అది ఫ్లాపయింది.
'బీస్ట్'ను నెల్సన్ తీసిన విధానాన్ని విజయ్ తండ్రి ఎస్.ఎ. చంద్రశేఖర్ స్వయంగా తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో 'తలైవర్ 169' డైరెక్టర్ మారనున్నాడంటూ కోలీవుడ్‌లో విరివిగా ప్రచారంలోకి వచ్చింది. నెల్సన్ ప్లేస్‌లో అట్లీ లేదా, డేసింగ్ పెరియసామి వచ్చే అవకాశం ఉందంటూ కూడా ప్రచారం సాగుతోంది.
అయితే తన విమర్శకులకు చెక్ పెడుతూ సోషల్ మీడియా ప్రొఫైల్‌లో తన మునుపటి మూడు సినిమాలకు 'తలైవర్ 169'ను జోడించాడు నెల్సన్. రజనీ సైతం ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు తీసిన స్టిల్‌తో తన ప్రొఫైల్ ఫొటోను మార్చారు. అంటే 'తలైవర్ 169' డైరెక్టర్ నెల్సన్ అని ఆయన ధ్రువీకరించారన్న మాటే.
![]() |
![]() |