![]() |
![]() |

'ఆర్ఆర్ఆర్' రికార్డుల వేట కొనసాగుతూనే ఉంది. మార్చి 25 న విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ ఇప్పటికే పలు రికార్డులు క్రియేట్ చేసింది. ఇక తాజాగా ఆర్ఆర్ఆర్ సృష్టించిన రికార్డు ఇప్పట్లో మరే సినిమా బ్రేక్ చేసే అవకాశం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ 400 కోట్ల క్లబ్ లో చేరింది.
నిన్నటితో నాలుగు వారాలు పూర్తి చేసుకున్న ఆర్ఆర్ఆర్.. విడుదలైన రోజు నుంచే తెలుగు స్టేట్స్ లో సత్తా చాటుతోంది. ఇప్పటికే 'బాహుబలి-2' రికార్డులను భారీ తేడాతో బ్రేక్ ఈ మూవీ తాజాగా మరో సంచలన రికార్డు సృష్టించింది. 28 రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రూ.264.91 కోట్ల షేర్, రూ.400 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 400 కోట్ల గ్రాస్ రాబట్టిన మొదటి సినిమాగా ఆర్ఆర్ఆర్ నిలిచింది.
ఇక వరల్డ్ వైడ్ గా 451 కోట్ల బిజినెస్ చేసిన ఆర్ఆర్ఆర్ నాలుగు వారాల్లో ఓవరాల్ గా 592.59 కోట్ల షేర్(1097.30 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేసింది. నేడు ఆర్ఆర్ఆర్ 1100 కోట్ల క్లబ్ లో చేరే అవకాశముంది. అలాగే ఈ వీకెండ్ లో 600 కోట్ల షేర్ మార్క్ కూడా క్రాస్ చేసే ఛాన్స్ ఉంది.
![]() |
![]() |