![]() |
![]() |
.webp)
'ఆర్ఎక్స్ 100' సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ.. 'గ్యాంగ్ లీడర్', 'వలిమై' సినిమాలతో విలన్ గానూ ఆకట్టుకున్నాడు. అయితే 'ఆర్ఎక్స్ 100' తర్వాత హీరోగా సరైన హిట్ అందుకోని కార్తికేయ.. కమ్ బ్యాక్ ఇవ్వాలని పట్టుదలగా ఉన్నాడు. తాజాగా ఆయన హీరోగా ఓ సినిమా ప్రారంభమైంది.

'కలర్ ఫోటో', 'తెల్లవారితే గురువారం' వంటి సినిమాలను నిర్మించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్ కార్తికేయ హీరోగా ఓ సినిమా నిర్మిస్తోంది. క్లాక్స్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో 'డీజే టిల్లు' బ్యూటీ నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. శుక్రవారం ఈ మూవీ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి సన్నివేశానికి కార్తికేయ భార్య లోహిత కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. ప్రొడ్యూసర్ నాగవంశీ క్లాప్ కొట్టారు. డైరెక్టర్ బుచ్చిబాబు మూవీ టీంకి స్క్రిప్ట్ అందించారు.

మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మరో విశేషం ఉంది. ఇందులో ఒక పాటకి సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించినట్లు తెలుస్తోంది. ఇదే ఆయన చివరి పాట అని అంటున్నారు.
![]() |
![]() |