![]() |
![]() |

తెలుగు సినిమా, హిందీ సినిమా, తమిళ సినిమా. మలయాళ, కన్నడ సినిమా ఇలా అనుకునే రోజులు దాటిపోయాయి. ఇప్పుడు ఉంది పాన్ ఇండియా సినిమా. బడా హీరోలతో పాటు ప్రేక్షకులు ఇదే మాటని నమ్ముతున్నారు. మేకర్స్ కూడా అందుకు తగ్గట్టే తమ చిత్రాలన్నీ ముస్తాబు చేస్తున్నారు. దీంతో అగ్ర హీరోల సినిమా రిలీజ్ రోజు పాన్ ఇండియా స్థాయిలో పోటీ నెలకొని ఉంది.
ఈ కోవలోనే రెబల్ స్టార్ 'ప్రభాస్'(Prabhas),ఇళయదళపతి 'విజయ్'(Vijay)మధ్య పాన్ ఇండియా స్థాయిలో 'వార్' షురూ కాబోతుందని సినీ విశ్లేషకులు బావిస్తున్నారు. ప్రభాస్ అప్ కమింగ్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి కానుకగా జనవరి 9 న విడుదల కాబోతుంది. ఈ విషయాన్నీ ఇటీవల నిర్మాత 'టిజి విశ్వప్రసాద్' అధికారకంగా వెల్లడి చేసాడు. ఇదే రోజు విజయ్ 'జననాయగాన్'(Jana Nayagan)విడుదల కానుంది. ఈ ఇద్దరికి పాన్ ఇండియా స్థాయిలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ ఉంది. ఓవర్ సీస్ లో సేమ్ పరిస్థితి. ఈ విషయాన్నీ దృష్టిలో పెట్టుకొని, ఎక్కువ థియేటర్స్ లో ఈ రెండు చిత్రాలని రిలీజ్ చెయ్యడానికి మేకర్స్ భావిస్తారు. సంక్రాంతికి చిరంజీవి(Chiranjeevi)కూడా బరిలోకి దిగుతున్నా,తిమ్మిదిన రాకపోవచ్చు.దీంతో తొలి రోజు థియేటర్స్ విషయంలో ప్రభాస్, విజయ్ చిత్రాల మధ్య పోటీ ఖాయం. ఈ నేపథ్యంలో ఏ చిత్రానికి ఎక్కువ థియేటర్స్ లభిస్తాయనే చర్చ ఇప్పట్నుంచే పరిశ్రమ వర్గాల్లో జరుగుతుంది. తొలి రోజు కలెక్షన్స్ లో ఎవరు పై చెయ్యి సాధిస్తారనే ఆసక్తి కూడా అందరిలో ఉంది.
విజయ్ ఇటీవల రాజకీయాల్లో ప్రవేశించిన సందర్భంగా 'జననాయకుడు' తన ఆఖరి చిత్రంగా విడుదల కాబోతుంది. పైగా పొలిటికల్ టచ్ ఉన్న సబ్జెట్ కావడంతో 'జననాయకుడు' కథపై ఆసక్తి నెలకొని ఉంది.రాజా సాబ్ ద్వారా ప్రభాస్ ఫస్ట్ టైం హర్రర్ కామెడీ చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో హర్రర్ కామెడీ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. దీంతో ఏ సినిమా హిట్ టాక్ ని తెచ్చుకుంటుందనే క్యూరియాసిటీ ఏర్పడింది. రెండు డిఫరెంట్ సబ్జెట్స్ కావడంతో రెండిటికి హిట్ టాక్ వచ్చినా, కలెక్షన్స్ పరంగా ఏ చిత్రం ముందు వరుసలో నిలుస్తుందనే ఆసక్తి కూడా అందరిలో ఉంది. కాకపోతే నార్త్ లో విజయ్ కంటే ప్రభాస్ కే ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా ఇద్దరి అభిమానులు మాత్రం తమ హీరోనే తొలి రోజు రికార్డు కలెక్షన్స్ సాధిస్తాడని కామెంట్స్ చేస్తు వస్తున్నారు.

![]() |
![]() |