![]() |
![]() |

మూడు దశాబ్దాల క్రితమే పాన్ ఇండియా డైరెక్టర్ గా తన సత్తా చాటాడు శంకర్(Shankar).పైగా ఆ చిత్రాలన్నీసామాజిక సమస్యతో పాటు దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కడంతో పాన్ ఇండియా వ్యాప్తంగా శంకర్ కి అభిమానులు ఏర్పడ్డారు. కాకపోతే గత కొంతకాలం నుంచి వరుస పరాజయాల్ని ఎదుర్కొంటున్నాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన భారతీయుడు 2 , గేమ్ చేంజర్' దారుణంగా నిరాశపరిచాయి. దీంతో తన అప్ కమింగ్ సినిమాల విషయంలో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నెలకొని ఉంది.
శంకర్ కూతురు పేరు 'అదితి శంకర్'(Aditi Shankar).2022లో కార్తీ హీరోగా వచ్చిన 'విరుమాన్'ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం పెద్దగా ప్రభావాన్ని చూపించలేదు. ఆ తర్వాత శివ కార్తికేయన్ తో చేసిన 'మావీరన్' కూడా సక్సెస్ ని అందుకోలేకపోయింది. దీంతో 'అదితి' కి తమిళనాట అవకాశాలు తగ్గాయి. ఓజి(Og)ఫేమ్ అర్జున్ దాస్ తో చేసిన 'వన్స్ మోర్' షూటింగ్ కంప్లీట్ అయినా కూడా, రిలీజ్ వాయిదా పడుతు వస్తుంది. తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని, ఈ ఏడాది మార్చిలో 'భైరవం'తో ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం తనకి ఆశించినంత పేరు గాని, కొత్త అవకాశాలని తీసుకురావడం గాని చేయలేదు. దీంతో అదితి ని హీరోయిన్ గా నిలబెట్టాలనే దృఢ సంకల్పంతో శంకర్ ఉన్నట్టుగా తమిళ సినీ సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగా తన శిష్యుడు, ప్రస్తుతం దర్శకుడిగా సత్తా చాటుతు ఉన్న 'అరివళగన్'(Arivazhagan)ని రంగంలోకి దింపుతున్నట్టుగా తెలుస్తుంది. అరివళగన్ దర్శకత్వంలో 'అదితి' ప్రధాన పాత్ర చేసుకొని ఒక ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీని శంకర్ సిద్ధం చేస్తున్నట్టుగా సమాచారం. ఈ మేరకు అధికార ప్రకటన త్వరలోనే రానుందనే మాటలు కూడా వినపడుతున్నాయి.
శంకర్ వద్ద అనేక చిత్రాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన 'అరివళగన్' 2009 లో 'ఈరం' సినిమాతో దర్శకుడిగా మారాడు. ఈ చిత్రం తెలుగులో 'వైశాలి' పేరుతో రిలీజై మంచి విజయాన్ని అందుకుంది. శంకర్ నే నిర్మాతగా వ్యవహరించాడు. మరి కూతురు అదితి చిత్రానికి కూడా శంకర్ నిర్మాతగా వ్యవహరిస్తాడేమో చూడాలి. ఇక విభిన్న చిత్రాలని అందించే దర్శకుడుగా 'అరివళగన్' కి ప్రేక్షకుల్లో మంచి పేరు ఉంది. ఈ ఏడాది పిబ్రవరిలో 'శబ్దం' తో తమిళ, తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

![]() |
![]() |