![]() |
![]() |

సెప్టెంబర్ 25న విడుదల కానున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నూతన చిత్రం 'ఓజీ'పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఓజీ మూవీ బాక్సాఫీస్ ని షేక్ చేసి, సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని వారు బలంగా నమ్ముతున్నారు. ఇప్పటికే ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ టికెట్ ఏకంగా రూ.5 లక్షలకు అమ్ముడవ్వడం సంచలనంగా మారింది. (They Call Him OG)
నైజాం ఏరియాకి సంబంధించి 'ఓజీ' మూవీ ఫస్ట్ టికెట్ ని తాజాగా వేలం వేశారు. వేలంలో ఈ టికెట్ ని 'టీం కళ్యాణ్ సేన' ఏకంగా రూ.5 లక్షలకు దక్కించుకుంది. వేలం ద్వారా వచ్చిన ఈ మొత్తాన్ని జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వబోతున్నారట.
ఎంత ఫస్ట్ టికెట్ అయినప్పటికీ, ఒక మూవీ టికెట్ అనేది ఐదు లక్షలకు అమ్ముడవ్వడం మామూలు విషయం కాదు. దీనిని బట్టే 'ఓజీ' సినిమా పట్ల అభిమానుల్లో ఎంతటి క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత హైప్ ని చూస్తుంటే.. ఓజీ మూవీ ఓపెనింగ్స్ కళ్ళు చెదిరేలా ఉండటం ఖాయమనిపిస్తోంది.
![]() |
![]() |