![]() |
![]() |
ప్రేక్షకులు, అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘కల్కి’ ట్రైలర్ రానే వచ్చింది. ఇప్పుడు ఈ ట్రైలర్ గురించి జోరుగా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ట్రైలర్‌పై రకరకాల ఒపీనియన్స్ వినిపిస్తున్నాయి. హాలీవుడ్ మూవీస్‌ని మించే స్థాయిలో ఈ ట్రైలర్ ఉందని కొందరు అంటుంటే, మరికొందరు ఇంత హెవీ విజువల్ ఎఫెక్ట్స్‌ని మన ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేరని కొందరంటున్నారు. అంతే కాదు, ఇందులోని విజువల్స్, సినిమా కాన్సెప్ట్, ఆర్‌ఆర్, యాక్షన్ సీక్వెన్స్.. ఇలా అన్నింటి గురించి రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.
ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ చూస్తే అసలు ఈ సినిమా కాన్సెప్ట్ ఏమిటి అనేది రివీల్ అవ్వకుండా జాగ్రత్త పడినట్టు కనిపిస్తోంది. కథ గురించి తెలిసీ తెలియనట్టుగానే అనిపిస్తుంది తప్ప క్లారిటీ అనేది లేదు. ముఖ్యంగా మధ్యలో వచ్చే విజువల్ ఎఫెక్ట్స్ హై రేంజ్‌లో ఉండడంతో ఇక కాన్సెప్ట్ గురించి ఆలోచించే పరిస్థితి లేకుండా ఉంది. ప్రభాస్ క్యారెక్టర్ ఏమిటి, అమితాబ్ క్యారెక్టర్ హీరోకి ఎలా కనెక్ట్ అవుతోంది, వారిద్దరి మధ్య ఫైట్ ఎందుకు? బుజ్జి, భైరవ రిలేషన్ ఏమిటి.. ప్రశ్నలు ప్రతి ఒక్కరినీ వేధిస్తున్నాయి. వీటికి తోడు దీపిక పదుకొణే, దిశా పటానిల క్యారెక్టర్స్ ఏమిటి అనేది ట్రైలర్ చూసిన తర్వాత కూడా అర్థం కావడం లేదు. విలన్‌గా కొత్త అవతారం ఎత్తిన కమల్‌హాసన్ లుక్ మాత్రం చాలా డిఫరెంట్‌గా కనిపిస్తోంది. కనిపించింది కాసేపే అయినా కమల్ డిస్కషన్ పాయింట్‌గా మారారు.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు సోషల్ మీడియాలో దీపికా పదుకొనే హాట్ టాపిక్‌గా మారింది. ఆమె క్యారెక్టర్‌కు డబ్బింగ్ పర్‌ఫెక్ట్‌గా సెట్ అవ్వలేదంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. ఈ విషయంలో దీపికపై ట్రోలింగ్ నడుస్తోంది. ట్రైలర్‌లో వినిపించిన వాయిస్ సినిమాలో కూడా అలాగే ఉంటే సమస్యేనంటున్నారు అభిమానులు. ఏది ఏమైనా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ విజువల్ వండర్ కోసం ప్రేక్షకులు, అభిమానులే కాదు, భారతదేశంలోని అన్ని సినిమా పరిశ్రమలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఎందుకంటే ఇంత హై టెక్నాలజీతో ఓ విజువల్ వండర్‌గా రూపొందిన సినిమా భారతదేశంలోనే లేదనేది ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది.
![]() |
![]() |