![]() |
![]() |

శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి మూవీ తో తెలుగు ప్రేక్షకులందరు తన సినిమాల కోసం ఎదురుచూసేలా చేసుకున్న దర్శకుడు వైవీఎస్ చౌదరి(yvs chowdary)ఆ తర్వాత సీతారామరాజు, సీతయ్య, యువరాజు, లాహిరి లాహిరి లో, దేవదాస్, రేయ్, సలీం, ఒక్కమగాడు లాంటి చిత్రాలని తెరకెక్కించాడు. లేటెస్ట్ గా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
వైవీఎస్ చౌదరి ప్రస్తుతం ఎన్టీఆర్ మునిమనవడు, దివంగత జానకీ రామ్ కొడుకైన నందమూరి తారకరామారావు (nandamuri tarakaramarao) ని హీరోగా పరిచయం చేస్తు ఒక మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే అధికారకంగా ప్రకటన కూడా వచ్చింది. పైగా చౌదరి నే ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కొత్త వాళ్లతోనే ఎక్కువ భాగం సినిమాలు తెరకెక్కిస్తారు. పైగా ప్రొడ్యూస్ కూడా చేస్తారనే విషయం ప్రస్తావనకు వచ్చింది. దీంతో రామ్ పోతినేని హీరోగా వచ్చిన దేవదాస్ మూవీని చౌదరి ఉదాహరణగా చెప్పాడు. దేవదాస్ మూవీ అప్పుడు రామ్ ఎవరో ఎవరకి తెలియదు. అలాంటిది ఆ సినిమాకి పది కోట్లు ఖర్చుపెట్టాను. మూవీ రిలీజ్ అయ్యాక డబ్బులు పోయాయని చెప్పారు.పైగా ప్రాపర్టీస్ అన్ని స్టే లో ఉన్నాయి. దీంతో జీ టీవీకి శాటిలైట్ రైట్స్ ని తక్కువ ధరకు అమ్మాను.ఆ వచ్చిన డబ్బుతో పబ్లిసిటీ చేశాను.
కానీ అప్పటికి కూడా థియేటర్స్ దగ్గర ఆడియెన్స్ లేరు. నాలుగు వారాల పాటు థియేటర్ల చుట్టూ తిరిగాను. లోపలకి వెళ్తే జనం ఉండే వాళ్ళు కాదు. అప్పుడు థియేటర్ మొత్తం జనం ఉన్నట్టుగా ఉహించుకొని మాట్లాడే వాడినని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ మాటలు వైరల్ గా మారాయి. ఏది ఏమైనా దేవదాస్ మాత్రం మౌత్ టాక్ తో సూపర్ హిట్ గా నిలిచింది. చాలా కేంద్రాల్లో వంద రోజులు. నూటడెబ్భై ఐదు రోజులు ఆడింది.
![]() |
![]() |