![]() |
![]() |

2011 లో నాచురల్ స్టార్ నాని (nani) హీరోగా వచ్చిన అలా మొదలయ్యింది తో నందిని రెడ్డి(nandini reddy) దర్శకురాలిగా పరిచయం అయ్యింది . మొదటి సినిమాతోనే విభిన్నమైన దర్శకురాలుగా పేరు సంపాదించింది. ఆ తర్వాత జబర్దస్త్, కల్యాణ వైభోగమే, ఓ బేబీ, పిట్ట కథలు, అన్ని మంచి శకునములే వంటి సినిమాలని తెరకెక్కించింది. లేటెస్ట్ గా ఆమె ఇంట్లో ఒక విషాదం చోటుచేసుకుంది.
గత కొన్నాళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతోన్న నందిని రెడ్డి సోదరి శాంతి కన్నుమూశారు. సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని నందిని నే తెలియచేసింది. మనసుకు బాగా దగ్గరైన వాళ్లను కోల్పోవడం అంత ఈజీ కాదు. నాతో పాటు కలిసి పెరిగిన వారిలో ఒకరు దూరం కావడం నాకిదే మొదటిసారి. అక్క అని ఆప్యాయంగా పిలిచేది. చాలా దయ కలిగిన వ్యక్తి. ఎలాంటి కల్మషం లేని ఆమె నవ్వు తనకి చాలా బలం. ఆ బలం, చిరు నవ్వుతో గత నాలుగు నెలలుగా ఒక పెద్ద యుద్దమే చేస్తోంది. కానీ దురదృష్టవశాత్తూ ఆ పోరాటంలో నా సోదరి ఓడిపోయింది.
మరో లోకానికి వెళ్లిపోవాల్సిన సమయం వచ్చి వెళ్లిపోయింది. తను మంచి కుమార్తె, ఒక మంచి సోదరి, ఒక మంచి భార్య,మంచి తల్లి మంచి ఫ్రెండ్. మరోసారి మనం కలిసే వరకు నిన్ను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటానని చెప్పింది ఈ సందర్భం లో నందిని రెడ్డి చాలా ఎమోషనల్ కి గురయ్యింది. పలువురు సినిమా వాళ్ళు నందినీ రెడ్డికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
![]() |
![]() |