![]() |
![]() |
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ సినిమా రిలీజ్ అయ్యిందంటే.. దేశంలో ఏ థియేటర్‌లో విడుదల కాకపోయినా ముంబైలోని అతిపెద్ద సింగిల్ స్క్రీన్ థియేటర్ మరాఠా మందిర్‌లో మాత్రం తప్పకుండా రిలీజ్ అవుతుంది. షారూక్ ఖాన్ ఎవర్‌గ్రీన్ హిట్ ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయెంగే’ గత 29 సంవత్సరాలుగా ఈ థియేటర్‌లో ఆడుతోంది. ప్రతిరోజూ మార్నింగ్ షో ఈ సినిమాకు కేటాయిస్తారు. మిగతా మూడు షోలను కొత్త సినిమాకు ఇస్తారు. అదేవిధంగా డిసెంబర్ 21న రిలీజ్ అయిన షారూక్ కొత్త సినిమా ‘డంకీ’కి మూడు షోలు కేటాయించారు. మొదటి రోజు ‘డంకీ’ మూడు షోలు వేశారు.
మరోపక్క డిసెంబర్ 22న విడుదలైన ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘సలార్’కి నార్త్‌లో థియేటర్లు ఎక్కువ వేయలేదనే విమర్శ ఉంది. ఈ విషయంలో ప్రభాస్ అభిమానులు ఎంతో నిరుత్సాహంగా ఉన్నారు. దీనికి కారణం అంతకుముందు రోజే ‘డంకీ’ రిలీజ్ అవ్వడమే. ఐనాక్స్, పీవీఆర్, మిరాజ్‌లాంటి మల్టీప్లెక్స్ చెయిన్స్ కూడా ‘డంకీ’ వల్ల ‘సలార్’కి ఎక్కువ షోలు ఇవ్వలేదు. దీనిపై ‘సలార్’ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ రంగంలోకి దిగడంతో వీళ్లంతా దారికొచ్చి ‘డంకీ’, ‘సలార్’కు 50-50 కేటాయింపు చేశారని తెలిసింది. ఈ పరిస్థితిలో షారూక్‌కు ప్రభాస్ వల్ల ఘోర పరాభవం జరిగింది. షారూక్ సొంత థియేటర్‌లాంటి మరాఠా మందిర్‌లో ‘సలార్’ కోసం ‘డంకీ’ చిత్రాన్ని ఎత్తివేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. షారూక్ కొత్త సినిమా రిలీజ్ అయిన సమయంలో మరో సినిమాకి మూడు షోలు కేటాయించడం అనేది ఆ థియేటర్ చరిత్రలోనే లేదు. అలాంటిది ‘దిల్‌వాలా దుల్హానియా లే జాయేంగే’ మినహా ‘డంకీ’కి కేటాయించిన మూడు షోలను ‘సలార్’కు ఇచ్చేసింది మరాఠా మందిర్ యాజమాన్యం.
డిసెంబర్ 22న మార్నింగ్ షో ‘దిల్‌వాలా దుల్హానియా లే జాయేంగే’ వేయగా.. మిగిలిన మూడు షోలు ‘సలార్’ వేశారు. అంతేకాదు, ఆ మూడు షోలలో ఒక్క షో కూడా ‘డంకీ’కి కేటాయించకపోవడంతో షారూక్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఆ అక్కసుతో ‘సలార్’పై దుష్ప్రచారం మొదలుపెట్టారు షారూక్ అభిమానులు. ‘దిల్‌వాలా దుల్హానియా లే జాయేంగే’ సినిమాకు 40 టికెట్లు తెగితే.. ‘సలార్’కు 15 టికెట్లే తెగాయని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ‘సలార్’ దూకుడికి తట్టుకోలేకే బాలీవుడ్ సినీవర్గాలు, షారూక్ అభిమానులు ఇలాంటి ఫేక్ ప్రచారాన్ని చేస్తున్నారని ప్రభాస్ అభిమానులు కూడా కామెంట్స్ పెడుతున్నారు.
![]() |
![]() |