![]() |
![]() |

గోపీచంద్ హీరోగా నటించిన 'లక్ష్యం' మూవీతో డైరెక్టర్ గా పరిచయమయ్యాడు శ్రీవాస్. 2007లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్ లో వచ్చి న మరో చిత్రం 'లౌక్యం'. 2014లో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా.. గోపీచంద్ ని ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర చేసింది. అయితే ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో మరో మూవీ రాబోతోంది.
గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ ఫిల్మ్ ను బుధవారం అధికారికంగా ప్రకటించారు. గోపీచంద్ కెరీర్‌లో ఇది 30వ సినిమా. అధికారిక ప్రకటనతో తాజాగా పోస్టర్ ను విడుదల చేశారు. పోస్టర్ లో కోల్‌కత్తాలోని హౌరా బ్రిడ్జి, కాళీ మాత విగ్రహం కనిపిస్తున్నాయి. పోస్టర్ ని బట్టి చూస్తే.. ఈ సినిమా కథ కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని తెలుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో శ్రీవాస్ - గోపీచంద్ కాంబో హ్యాట్రిక్ హిట్ కొడతారేమో చూడాలి.
ప్రస్తుతం గోపీచంద్ మారుతి దర్శకత్వం వహిస్తున్న 'పక్కా కమర్షియల్' సినిమాతో బిజీగా ఉన్నాడు. అలాగే సంపత్ నంది దర్శకత్వంలో నటించిన 'సీటీమార్' రిలీజ్ కి రెడీగా ఉంది.
![]() |
![]() |