![]() |
![]() |

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సెన్సేషనల్ హిట్ `మిర్చి` (2013)తో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసిన సీనియర్ హీరోయిన్ నదియా.. అదే సంవత్సరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మేనత్తగా నటించిన `అత్తారింటికి దారేది`తో స్టార్ డమ్ చూశారు. ఆపై `దృశ్యం`, `బ్రూస్ లీ`, `నా పేరు సూర్య` వంటి బిగ్ టికెట్ ఫిల్మ్స్ లో నటిగా తనదైన ముద్ర వేసిన నదియా.. ప్రస్తుతం `దృశ్యం 2`, `గని`, `వరుడు కావలెను` చిత్రాల్లో నటిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా నదియా మరో క్రేజీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఆ వివరాల్లోకి వెళితే.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కథానాయకుడిగా `పందెం కోడి` ఫేమ్ లింగుస్వామి తెలుగు, తమిళ భాషల్లో ఓ బైలింగ్వల్ మూవీని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఊరమాస్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నదియా కనిపించనున్నారట. అంతేకాదు.. తన షూటింగ్ పార్ట్ కూడా ఆమె షురూ చేశారని సమాచారం. త్వరలోనే `రాపో 19`లో నదియా ఎంట్రీపై క్లారిటీ రానుంది.
కాగా, `రాపో 19`లో `ఉప్పెన` ఫేమ్ కృతి శెట్టి నాయికగా నటిస్తుండగా.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నాడు.
![]() |
![]() |