![]() |
![]() |

'సాహో' తరవాత ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా చిత్రీకరణ ప్రారంభమై చాలా రోజులైంది. ఓసారి ఇటలీ, మరోసారి జార్జియా వెళ్లొచ్చారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇండియాలో ఇటలీ సెట్స్ వేస్తున్నారు. సినిమాలు పనులు ఎప్పుడో మొదలైనా... ఇప్పటివరకు సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది ఇంకా అనౌన్స్ చేయలేదు. మధ్యలో మెగాస్టార్ చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి'కి సంగీతం అందించిన అమిత్ త్రివేది పేరు వినిపించింది. అయితే, ఇప్పుడు కొత్త పేరు వినిపిస్తోంది.
విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన రెండో సినిమా 'డియర్ కామ్రేడ్' పాటలు గుర్తున్నాయా? సినిమా ఆశించిన విజయం సాధించలేదు. కానీ, పాటలకి సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్ 20కి ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్‌ని మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకున్నారని తెలిసింది. లాక్‌డౌన్ టైమ్‌లో దర్శకుడు రాధాకృష్ణ, జస్టిన్ ప్రభాకరన్ మధ్య డిస్కషన్స్ జరిగాయట. ఆల్రెడీ రికార్డింగ్ సెషన్స్ స్టార్ట్ చేశారని టాక్.
![]() |
![]() |