![]() |
![]() |

ఒక దశలో అగ్ర కథానాయకులతోనే వరుస సినిమాలు చేసి వార్తల్లో నిలిచింది రకుల్ ప్రీత్ సింగ్. కట్ చేస్తే.. ఇప్పుడదే బాటలో పూజా హెగ్డే వెళుతోంది. అలాంటి ఈ ఇద్దరు కూడా ఒకే రోజు బాక్సాఫీస్ ముంగిట పోటీపడిన సందర్భం లేదు. త్వరలోనే ఆ ముచ్చట తీరనుంది.
ఆ వివరాల్లోకి వెళితే.. రకుల్ ప్రీత్ కథానాయికగా నటించిన అడ్వెంచరస్ మూవీ `కొండ పొలం` విజయదశమి కానుకగా అక్టోబర్ 8న తెరపైకి రానుంది. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో `ఉప్పెన` ఫేమ్ వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా నటించాడు. ఇక పూజా హెగ్డే విషయానికి వస్తే.. ఆమె హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్` కూడా అదే అక్టోబర్ 8న దసరా బరిలో దిగుతోంది. `బొమ్మరిల్లు` భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో అక్కినేని అఖిల్ హీరోగా నటించాడు. ఈ రెండు సినిమాలు కూడా జనాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నవే.
మరి.. వరుస పరాజయాల్లో ఉన్న రకుల్, వరుస విజయాల్లో ఉన్న పూజ మధ్య జరుగుతున్న ఈ బాక్సాఫీస్ వార్ లో ఎవరు విన్నర్ గా నిలుస్తారో చూడాలి.
![]() |
![]() |