![]() |
![]() |

సూపర్‌స్టార్ మహేశ్ హీరోగా పరశురామ్ పేట్ల డైరెక్ట్ చేస్తున్న మూవీ 'సర్కారువారి పాట'. ఒక బ్యాంక్ కుంభకోణం నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోందని సమాచారం. కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీకి సంబంధించి ఇంతదాకా రిలీజైన మహేశ్ ఫస్ట్ లుక్ కానీ, మహేశ్‌బాబు బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన బ్లాస్టర్ కానీ అదిరిపోయాయనే టాక్ వచ్చింది. బ్లాస్టర్ అయితే ఇంతదాకా 36 మిలియన్ వ్యూస్‌ను, 1 మిలియన్ లైక్స్‌ను, 167k కామెంట్స్‌ను పొంది, మంచి దూకుడు మీద ఉంది.
చాలా కాలం తర్వాత మహేశ్‌తో మరోసారి ఈ సినిమా కోసం పనిచేస్తున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఇదివరకు అతను మహేశ్‌తో 'దూకుడు', 'బిజినెస్‌మేన్', 'ఆగడు' సినిమాలకు పనిచేశాడు. వీటిలో మొదటి రెండు ఘన విజయాలు సాధించాయి. 'ఆగడు' సినిమా డిజాస్టర్ అయినప్పటికీ మ్యూజిక్ హిట్టయింది. ఇప్పుడు మునునుపటి మూడు సినిమాలకు మించిన ట్యూన్స్‌ను 'సర్కారువారి పాట' కోసం తమన్ సిద్ధం చేశాడని తెలిసింది. ఈ సినిమా సాంగ్స్ ఆల్బమ్ మ్యూజిక్ లవర్స్‌కు ఒక ఫీస్ట్‌గా ఉంటుందని అంటున్నారు.
ఇప్పటికే 'సర్కారువారి పాట' ఆడియో రైట్స్‌ను సరిగమ సంస్థ రికార్డు ధర చెల్లించి సొంతం చేసుకుంది. టాలీవుడ్‌లో ఇంతదాకా ఆడియో రైట్స్‌కు 4.5 కోట్లు చెల్లించడం మనం విని ఉండలేదు. ఈ సినిమాకు అది జరిగింది. త్వరలోనే ఈ సినిమా పాటలకు సంబంధించిన అధికారిక అప్‌డేట్ రానున్నది. 'సర్కారువారి పాట'ను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్, ఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి నిర్మిస్తున్నాయి.
![]() |
![]() |