![]() |
![]() |
.jpg)
నిన్నటి తరం అగ్ర కథానాయిక భూమికా చావ్లాకి తెలుగునాట ఓ విషయంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. అదేమిటంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఏడో సినిమాల్లో భూమికే నాయిక. పవన్ ఏడో చిత్రం `ఖుషి`, మహేశ్ ఏడో సినిమా `ఒక్కడు`, తారక్ సెవెన్త్ మూవీ `సింహాద్రి`లో భూమిక హీరోయిన్ గా నటించింది. విశేషంగా.. ఈ మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయి.
కట్ చేస్తే.. ఇప్పుడు భూమిక బాటలోనే మరో హీరోయిన్ వెళుతోంది. ఆమె మరెవరో కాదు.. `బుట్టబొమ్మ` పూజా హెగ్డే. పవన్, మహేశ్, తారక్ ఏడవ చిత్రాల్లో భూమిక నాయికగా నటిస్తే.. 28వ సినిమాల్లో పూజ హీరోయిన్. ఎన్టీఆర్ 28వ చిత్రం `అరవింద సమేత`లో లీడింగ్ లేడీగా నటించిన మిస్ హెగ్డే.. తాజాగా మహేశ్ 28వ సినిమాలో మెయిన్ లీడ్ గా సెలెక్ట్ అయింది. అంతేకాదు.. పవన్ 28వ చిత్రంగా అనౌన్స్ అయిన హరీశ్ శంకర్ మూవీలో కూడా పూజ పేరే ప్రముఖంగా వినిపిస్తోంది.
మరి.. `అరవింద సమేత`లాగే రాబోయే సినిమాలు కూడా విజయం సాధిస్తే.. భూమికలాగే పూజ కూడా పవన్, మహేశ్, తారక్ కాంబోలో రేర్ ఫీట్ అందుకున్న హీరోయిన్ గా టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు పొందుతుంది. చూద్దాం.. ఏం జరుగుతుందో?
![]() |
![]() |