![]() |
![]() |

ముగిసిపోయిందనుకున్న టాలీవుడ్ డ్రగ్ కేసులో ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగప్రవేశంతో ఇండస్ట్రీలో మరోసారి ప్రకంపనాలు చెలరేగుతున్నాయి. డ్రగ్ కేసును తిరిగి తెరిచిన ఈడీ రేపట్నుంచి అంటే మంగళవారం నుంచి వివిధ సెలబ్రిటీలను విచారించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ముగ్గురు నిందితుల నుంచి ఈడీ అధికారులు స్టేట్‌మెంట్ తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 12 మంది సెలబ్రిటీలకు నోటీసులు జారీ అయిన విషయం పాఠకులకు తెలిసిందే.
మొట్టమొదటగా రేపు డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ను ఈడీ అధికారులు విచారించనున్నారు. సెప్టెంబర్ 2న నటి-నిర్మాత చార్మి కౌర్, సెప్టెంబర్ 6న హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్, ఆ తర్వాత రానా, రవితేజ, నవదీప్, ముమైత్ ఖాన్, తనీశ్, నందు, తరుణ్ తదితరులను విచారించనున్నారు. సెప్టెంబర్ 22 వరకు ఈ విచారణ జరుగుతుంది.
ఈ విచారణలో ఆయా సెలబ్రిటీలు డ్రగ్స్ వాడారా? లేదా? ఒకవేళ్ల డ్రగ్స్ వాడితే అవి ఎక్కడ్నుంచి వచ్చాయి? ఏ రూపంలో వచ్చాయి? వాళ్లకు మనీ ట్రాన్సాక్షన్ ఏ తరహాలో చేశారు? లాంటి ప్రశ్నలను అడిగే అవకాశం ఉంది. బాలీవుడ్‌లో మనీ లాండరింగ్ వ్యవహారం సందర్భంగా డ్రగ్ కేసు బయటకు వచ్చింది. అందువల్ల ప్రధానంగా ఆ అంశంపైనే ఈడీ అధికారులు సెలబ్రిటీలను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా నాలుగేళ్ల క్రితం ఇండస్ట్రీని షేక్ చేసిన డ్రగ్ కేసును మరోసారి ఈడీ తవ్వితీస్తుండటంతో టాలీవుడ్ కలవరానికి గురవుతోంది.
![]() |
![]() |