![]() |
![]() |

పాన్ ఇండియా మూవీ 'బ్రహ్మాస్త్ర'లో నటిస్తోన్న అక్కినేని నాగార్జున తన క్యారెక్టర్‌కు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేశారు. అయన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో రణబీర్, అలియా భట్ పెయిర్‌గా నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ మరో కీలక పాత్ర చేస్తున్నారు. మంగళవారం రణబీర్, అలియా, అయన్ ముఖర్జీలతో దిగిన రెండు పిక్చర్స్‌ను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు నాగ్.
వాటితో పాటు, "బ్రహ్మాస్త్రలో నా షూటింగ్ పూర్తయింది. రణబీర్, అలియా లాంటి స్టెల్లార్ పర్ఫార్మర్స్‌తో కలిసి పనిచేయడం అమేజింగ్ ఎక్స్‌పీరియెన్స్. అయన్ ముఖర్జీ క్రియేట్ చేసిన ఔట్‌స్టాండింగ్ వరల్డ్‌ను చూసేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నా" అని రాసుకొచ్చారు. తన పోస్ట్‌కు #TheBigIndianMovie #Brahmastra అనే హ్యాష్‌ట్యాగ్స్‌ను జోడించారు.
హిందీలో రూపొందుతోన్న బ్రహ్మాస్త్రను తెలుగు, కన్నడ, మళయాలం, కన్నడ భాషల్లోనూ అనువదిస్తున్నారు. మౌనీ రాయ్, డింపుల్ కపాడియా, ప్రతీక్ బబ్బర్, దివ్యేందు తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి ప్రీతమ్ మ్యూజిక్ అందిస్తుండగా, అక్కినేని శ్రీకరప్రసాద్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్‌తో కలిపి ధర్మా ప్రొడక్షన్స్ ఈ మూవీని నిర్మిస్తోంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో 'బ్రహ్మాస్త్ర' నిర్మాణమవుతోంది.

![]() |
![]() |