![]() |
![]() |

ఏడేళ్ల క్రితం డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తనపై అత్యాచార యత్నం చేశాడని ఆరోపించి, పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి పాయల్ ఘోష్.. అతనిపై చర్యలు తీసుకోకపోతే నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించింది. పలుకుబడి కలిగిన వ్యక్తి కావడం వల్లే ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ ముంబై పోలీసులు అతనిని అరెస్ట్ చేయలేదని వెర్సోవా పోలీస్ స్టేషన్ బయట ఆమె రిపోర్టర్లతో మాట్లాడుతూ చెప్పారు.
తమ కేసుపై త్వరిత గతిన దర్యాప్తు చేయాలని కోరుతూ తన న్యాయవాది నితిన్ సత్‌పుట్‌తో కలిసి ఆదివారం ఆమె పోలీస్ట్ స్టేషన్‌కు వచ్చారు. 2013లో వెర్సోవాలోని యారి రోడ్‌లో ఉన్న ప్రదేశంలో కశ్యప్ తనపై అత్యాచారం చేశాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే కశ్యప్ ఈ ఆరోపణలను నిరాధారమైనవని కొట్టిపారేశారు.
తాను పోలీస్ స్టేషన్‌లో సీనియర్ ఆఫీసర్లను కలిశానని, "నాకు త్వరగా న్యాయం జరగకపోతే నిరాహార దీక్ష చేస్తాన"ని వాళ్లను హెచ్చరించానని ఘోష్ చెప్పారు. కశ్యప్, అతని శ్రేయోభిలాషుల నుండి ముప్పును ఎదుర్కొంటున్నట్లు ఆమె ఆరోపించారు.
దర్యాప్తు అధికారి లేనందున సోమవారం మళ్లీ పోలీస్‌స్టేషన్‌కు రావాలని పోలీసులు చెప్పినట్లు ఆమె తెలిపారు. 376 (ఐ) (అత్యాచారం), 354 (మహిళ తాలూకు గౌరవానికి భంగం కలిగించడం), 341 (తప్పుగా నిరోధించడం), 342 (తప్పుడు నిర్బంధం) కింద వెర్సోవా పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు.
"నా క్లయింట్ అనురాగ్ కశ్యప్ తప్పుడు ఆరోపణలతో తీవ్రంగా వ్యధ చెందారు. ఇవి పూర్తిగా అబద్ధం, హానికరమైనవి, నిజాయితీ లేనివి" అని కశ్యప్ న్యాయవాది ఇంతకుముందు ఒక ప్రకటనను ట్వీట్ చేశారు.
![]() |
![]() |