![]() |
![]() |
.jpg)
* ఇది వరకటిలా కాకుండా ప్రిపేర్ అయినట్లుగా మాట్లాడాడు.
* తనకి అభిమానుల అండ ఎప్పుడు ఉందని.. ప్లాపులు హిట్లు సంబంధం లేకుండా ఉందని పదే పదే చెప్పాడు.
* తన రక్తం పంచుకుని పుట్టిన వారికంటే త్రివిక్రమ్ దగ్గరే ఎక్కువ చనువుందని చెప్పాడు.
* తన జీవితం డిప్రెషన్ లో ఉన్నప్పుడు త్రివిక్రమ్ పరిచయం చేసిన పుస్తకాలు తనను డిప్రెషన్ నుంచి బయట పడేశాయని తెలిపాడు.
* తనకి త్రివిక్రమ్ కి మధ్య ఉన్న భావసారుప్యతని మళ్లీ గుర్తు చేశాడు.
* తను సినీ రంగంలో చేయగలిగినంత చేశానని ఇక ప్రజాసేవలో ఉంటాను అనే అర్థం వచ్చేలా మాట్లాడాడు.
* జల్సా మూవీ షూటింగ్ టైంలో చేసిన ప్రతి కామెడీ సీన్ ఎంతో బాధలో ఉండి చేశానని.. దాని నుంచి బయట పడేలా చేసింది త్రివిక్రమే అని చెప్పాడు.
* కెరీర్‌లో ఎంతోమంది డైరెక్టర్లతో పనిచేసినా .. త్రివిక్రమ్ ఒక్కడే తన స్వార్థం కోసం కాకుండా నా కోసం నిలబడ్డాడు.
* అజ్ఞాతవాసిలో వివిధ రాష్ట్రాలకు చెందిన నటీనటులు నటించారని.. ఇది భారతదేశ సమైక్యతను సూచించే విధంగా ఉందని చెప్పాడు.
* అభిమానుల గురించి చెబుతూ మీరు నా పై చూపించే ప్రేమను.. నేను కూడా చూపించాలని ఎప్పుడూ ఉంటుందని చెప్పాడు.
* ఈ సినిమా గురించి మేమంతా పడాల్సిన కష్టమంతా పడ్డాము ఇక ఫలితం మీ చేతుల్లోనే ఉందని చెప్పాడు.
* భారత్ మాతకి జై అంటూ స్పిచ్ స్టార్ట్ చేసిన పవన్.. ఎప్పటిలాగే జై హింద్‌తో తన ప్రసంగాన్ని ముగించాడు.
ఈ ఆడియో వేడుకలో మాట్లాడుతున్నంత సేపు పవన్ ఒకింత ఉద్విగ్నంగా ఉన్నట్లు కనిపించాడు
![]() |
![]() |