![]() |
![]() |

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అజ్ఞాతవాసి ఆడియో లాంఛ్ వేడుక హైదరాబాద్ హైటెక్స్‌లో గ్రాండ్‌గా జరిగింది. తమ అభిమాన హీరోని ప్రత్యక్షంగా చూడటానికి తెలుగు రాష్ట్రాల నుంచి అభిమానులు భారీగా చేరుకున్నారు. వేదిక మీద ఎంతమంది ఉన్నా షో మొత్తం పవన్, త్రివిక్రమ్‌ల మీదుగానే నడిచింది. తనికెళ్ల భరణి పవన్‌పై రాసుకొచ్చిన కవితను చదివి అభిమానుల్లో జోష్ నింపాడు. ఇక ఈ సినిమాలో పని చేసిన ఆది పినిశెట్టి, రావ్ రమేశ్, ఖుష్బూ తమకు పవన్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఇక పవర్‌స్టార్ అభిమాని ఒకరు బారీకేడ్లను దాటుకొని స్టేజ్‌మీదకు వచ్చి పవన్‌కు పాదాభివందనం చేశాడు.
వెంటనే అతన్ని అడ్డుకున్న బౌన్సర్లు చేయి చేసుకుంటుండగా కళ్యాణ్ వారిని అడ్డుకుని.. అతనితో సెల్ఫీ దిగి కిందకు పంపాడు. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మరోసారి తనదైన డైలాగ్స్‌తో అలరించాడు. అలనాటి సినీ దిగ్గజాల నుంచి నేటి నటీనటుల వరకు ప్రతి ఒక్కరికి వందనాలు తెలిపి.. అభిమానుల్ని జాగ్రత్తగా ఇంటికి వెళ్లాల్సిందిగా సూచించాడు. ఇక స్టేజ్ మీద కాస్తంత కంగారుకు గురయ్యే పవన్.. ఈ సారి మాత్రం చాలా బ్యాలెన్స్డ్గా ప్రసంగించాడు. తన రక్తం పంచుకుని పుట్టిన వారికంటే త్రివిక్రమ్ దగ్గరే ఎక్కువ చనువుందని.. ఎంతోమంది డైరెక్టర్లతో పనిచేసినా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక్కడే తన గురించి నిలబడ్డాడని చెప్పాడు.
![]() |
![]() |