![]() |
![]() |
.jpg)
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ ఉందంటే థియేటర్ ఓనర్ల గుండెల్లో రైల్లు పరిగెడతాయి. టిక్కెట్ల కోసం రచ్చ జరుగుతుందేమో.. కుర్చీలు విరుగుతాయేమో అన్న భయం వారిని వెంటాడుతుంటుంది. ఆయనను తెర మీద చూడటానికి అన్ని పాట్లు పడి.. ఒక్కసారి థియేటర్ లోపలికి వెళ్లి పవన్‌ను చూసి పడిన కష్టమంతా మరచిపోతారు. తెరపై కనిపిస్తేనే అంత రచ్చ జరిగితే.. మరి ఆయన ఎదురుగా ఉంటే అభిమానులు కామ్‌గా ఉంటారా..?
అభిమానులందరూ అభిమానాన్ని గుండెల్లో దాచుకోలేరు.. కొందరు వెంటనే ఆ ఎమోషన్‌ని చూపించేస్తారు. ఇప్పుడు అచ్చం అలాంటి ఇన్సిడెంటే జరిగింది. త్రివిక్రమ్- పవన్ కాంభోలో తెరకెక్కిన అజ్ఞాతవాసి ఆడియో రిలీజ్ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భారీగా తరలివచ్చారు. పవన్ ఎప్పుడు స్టేజ్ మీదకు వస్తాడా అని ఎదురుచూసిన ఒక అభిమాని.. పవర్‌స్టార్ వేదిక మీదకు రాగానే ఒక్కసారిగా తన సంతోషాన్ని ఆపుకోలేకపోయాడు. బారీకేడ్లను, బౌన్సర్లను దాటుకొని స్టేజ్ మీద ఉన్న పవన్ దగ్గరికి వచ్చి పాదాభివందనం చేశాడు. తేరుకున్న భద్రతా సిబ్బంది వెంటనే ఆ యువకుడిని పక్కకు లాగి కొట్టబోయారు.. కానీ అక్కడుంది పవన్ కళ్యాణ్ కదా.. వెంటనే వారిని వారించి అభిమానితో సెల్ఫీ దిగి కిందకు పంపించాడు.
![]() |
![]() |