![]() |
![]() |
.jpg)
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. అది ఒక వ్యక్తి పేరు కాదు.. అదోక ప్రభంజనం.. ఆ పేరు చెబితే రికార్డులు షేకవుతాయి. ఆ క్రేజ్ ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు.. కెరీర్ స్టార్టింగ్ నుంచి పవన్ ఫాలోయింగే వేరు. దానికి ఎన్నో ఉదాహరణలు.. అజ్ఞాతవాసి ఆడియో రిలీజ్ వేడుకలో పాల్గొన్న స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు తనకు జరిగిన అనుభవాన్ని చెప్పారు. బద్రీ సినిమాకి రాజుగారు డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించారు. ఆ సమయంలో సినిమాకు సంబంధించిన పోస్టర్ ఒక్కటి కూడా పడలేదని.. పవన్ లుక్ ఎలా ఉందో కూడా ఫ్యాన్స్‌కి తెలియదని.. అయినప్పటికీ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచిందన్నారు. ఇలాంటి సత్తా పవన్‌కు.. పవర్‌స్టార్ అభిమానులకు మాత్రమే సాధ్యమవుతుందని ప్రశంసించారు.
![]() |
![]() |